జిల్లాలో సహకార సంఘాలను బలోపేతం  చేయాలి..

- Advertisement -

జిల్లాలో సహకార సంఘాలను బలోపేతం  చేయాలి..

Co-operative societies should be strengthened in the district.

జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

బద్వేలు

కడప జిల్లాలో సహకార సంఘాలను బలోపేతం చేయడంలో మంరింత కృషి చేయాలని.. జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సభ్యులులను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు.
కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో.. జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తోపాటు.. జేసీ అదితి సింగ్ హాజరై.. జిల్లా సహకార అభివృద్ధిపై సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సహకార బ్యాంకుల్లో స్వయం సహాయక సంఘాల ఆర్థిక అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. రైతు సంఘాలకు అన్ని విధాలా ప్రోత్సాహం అందించాలన్నారు. జిల్లాలో డిసిసిబి అనుబంధంగా నడుస్తున్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (PACS) ప్రాజెక్ట్ యొక్క కంప్యూటరైజేషన్, ఎంపీఎఫ్ సి గోడౌన్ల నిర్మాణం, కామన్ సర్వీసు సెంటర్ల నిర్వహణ, పెట్రోల్ ఔట్ లెట్స్ నిర్వహణ, ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధీ కేంద్రాల (పిఎంబీజే ఏకే)నిర్వహణపై ప్రోత్సాహం తదితర అంశాల్లో జిల్లా సహకార కేంద్రం నిర్వహణ, అభివృద్ధి పురోగతిపై సమీక్షించి జిల్లా కలెక్టర్ పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీవో సుభాషిణి, డిపివో రాజ్యలక్ష్మి, జిల్లా వెటర్నరీ అధికారి డా. శారదమ్మ, మార్కెటింగ్, ఆప్కాబ్ అధికారులు, బ్యాంకు అధికారులు అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular