- Advertisement -
జవహర్ లాల్ నెహ్రూ కి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకుడు జవ్వాడి కృష్ణారావు
Congress leader Jawwadi Krishna Rao paid tribute to Jawaharlal Nehruకోరుట్ల,
జాతి నేత,స్వాతంత్ర సమరయోధుడు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కి పిల్లల పట్ల ఉండే మక్కువకు నిదర్శనమే బాలల దినోత్సవం ఆని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జవ్వాడి కృష్ణారావు ఆన్నారు..పట్టణంలోని జువ్వాడి భవన్ లో తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు..ఈ సందర్భంగా కృష్ణారావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ బ్రిటీష్ వారి పాలన నుండి మన స్వాతంత్ర్యం కోసం సుదీర్ఘ పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమర యోధుడు అని, దేశం కోసం 15 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన మహనీయుడని, భారతదేశ తొలి ప్రధానిగా 16 సంవత్సరాలు ఆయన చేసిన సేవలు దేశ అభివృద్ధికి పునాదులు పడ్డాయి అని, పండిత్‌జీ గా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు అని, నెహ్రూ
పిల్లల పట్ల గాఢమైన వాత్సల్యాన్ని మరియు మక్కువ ఎక్కువ కలిగి ఉండడం మరియు వారితో తన సమయాన్ని గడపడంతో ఆనందించేవారు. పిల్లలను మరియు వారి అమాయకత్వాన్ని గౌరవించడానికి మరియు పిల్లలతో నెహ్రూ గారికి ఉన్న మక్కువ వల్ల నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నమని , ఈ రోజున పాఠశాలలు, కళాశాలలు మరియు ఇతర సంస్థలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయని జువ్వాడి కృష్ణారావు పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయ, మ్యాకల నర్సయ్య,చిట్యాల లక్ష్మీనారాయణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అయూబ్, రాజు, కండ్లె నరేష్ తదితరులు పాల్గొన్నారు
- Advertisement -




