- Advertisement -
సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి
MLA Kavvampalli participated in Satyanarayana Swamy Vrathamతిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామి రథోత్సవంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన సత్యనారాయణస్వామి వ్రతంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పవిత్రమైన కార్తీక మాసంలో వెలిగించిన దీపకాంతులు ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
కార్తీక పౌర్ణమి వేళ ఈ వ్రతం నిర్వహించడం శుభప్రదమని పేర్కొన్నారు. పురాణాల్లో సైతం కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిన పూజలు, వ్రత విధానాల గురించి పండితులు పేర్కొనడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.సనాతన ధర్మంలో హింధువులకు అత్యంత ముఖ్యమైన పండుగలో కార్తీక పౌర్ణమి కూడా ఒకటని,పరమశివుడితోపాటు శ్రీమహావిష్ణువుకు కూడా అత్యంత ఇష్టమైన పర్వ దినమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, రేణిగుంట గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్కపల్లి రాజు,
కవ్వంపల్లి యువసేన జిల్లా అధ్యక్షుడు నోముల అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్కపల్లి శ్రీధర్, తమ్మనవేని రాములు యాదవ్, సురేందర్ రెడ్డి, బోయినపల్లి కృష్ణ బాబు, ఎండి హసన్, రవి, వచ్చునూరు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు
- Advertisement -




