వైసీపీకి బిగ్ షాక్..

- Advertisement -

వైసీపీకి బిగ్ షాక్..

Big shock for YCP..

నిడదవోలులో 11 మంది కౌన్సిలర్లు రాజీనామా..

ఏపీలో ఎన్నికల తర్వాత వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఆ పార్టీ అధినేత జగన్ అత్యంత సన్నిహితులు కూడా పార్టీ గురించి పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. 11 మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వివిధ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖ పంపారు.

కౌన్సిల్లో 27 మంది సభ్యుల

బలం ఉన్న వైసీపీ.. 11 మంది సభ్యుల రాజీనామాతో 16కు పడిపోయింది. రాజీనామా చేసిన వారిలో ప్రస్తుత చైర్మన్, వైస్ చైర్మన్ ఉన్నారు. మున్సిపాలిటీపై వైసీపీ పూర్తిగా పట్టు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది.

త్వరలో మరి కొంతమంది కౌన్సిలర్లు పార్టీ మారే అవకాశం కనిపిస్తుంది. ఇలాగే పరిస్థితి కొనసాగితే నిడదవోలులో వైసీపీ ఖాళీ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం నిడదవోలులో జనసేన పార్టీ చక్రం

తిప్పుతోంది. రాజీనామా చేసిన వారు జనసేనలో చేరుతారా? టీడీపీలో చేరుతారా? అనేది తెలియాల్సి ఉంది.

ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ మాజీ సలహాదారు ఎస్. రాజీవ్ కృష్ణ

టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. రాజీవ్ కృష్ణతో పాటు పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సైతం తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. మంత్రి నారా లోకేష్ వారిని పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రాజకీయంగా మంచి పట్టున్న రాజీవ్‌కృష్ణ చేరికతో టీడీపీకి మరింత బలం పెరిగింది. ఆయర పార్టీలో చేరిన రెండు రోజుల్లోనే 11 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular