యమగండంలా   విజయవాడ వాంబేకాలనీ ప్రధాన రోడ్లపై రాకపోకలు

- Advertisement -

యమగండంలా   విజయవాడ వాంబేకాలనీ ప్రధాన రోడ్లపై రాకపోకలు

Vijayawada Vambecolony Main Roads are like Yamagandam

పీకలదాకా మద్యం సేవించి ఆటో డ్రైవర్ ల హల్ చల్
స్పృహ లేకుండా ఆటో డ్రైవింగ్
డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి కట్టడి చేస్తామని హెచ్చరించిన పాయకాపురం సీఐ క్రిష్ణ మోహన్
విజయవాడ
అజిత్ సింగ్ నగర్ వాంబేకాలనీ ప్రాంతంలోని ప్రధాన రోడ్లపై రాకపోకలు యమగండంలా మారాయి. పైపులరోడ్డు నుండి  వాంబేకాలనీ వెళ్లే రోడ్డు మీద స్థానిక ఆటో డ్రైవర్ లు పీకలదాకా మద్యం సేవించి ఆటో డ్రైవింగ్ చేస్తు

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. శుక్రవారం సాయంత్రం అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన బిల్డర్ షేక్ జిలాని బైక్ పై వస్తుండగా వెనుక నుండి వచ్చిన ఆటో డీకొని గాయాలపాలయారు. బైక్ పై వెనుక

కూర్చుని ఉన నాగూర్ కూడా గాయాలపాలయారు. ఆటో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తో పాటు పక్కన ఉన్న మరో డ్రైవర్ పూటుగా మధ్యం సేవించి ఉన్నారు.  పాయకాపురం పోలీసుకు సమాచారం అందించడంతో వెంటనే

ఆటోను సీజ్ చేశారు. వాంబేకాలనీలో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆటో డ్రైవర్ లను కట్టడి చేస్తామని పాయకాపురం సీఐ క్రిష్ణ మోహన్ హెచ్చరిక జారి చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular