భూకబ్జా చేసిన ఎంపి అవినాష్ రెడ్డి కుటుంబం

- Advertisement -

భూకబ్జా చేసిన ఎంపి అవినాష్ రెడ్డి కుటుంబం

The family of MP Avinash Reddy who grabbed the land

పులివెందుల
పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి మీడియాతో మాట్లాడారు.  భూ కబ్జాల పై సంచలన వ్యాఖ్యలు చేసారు. వైయస్సార్సీపి ప్రభుత్వంలో నియోజకవర్గంలో భూ కబ్జాలు చేశారని ఆరోపించారు. వైఎస్ అవినాష్ రెడ్డి

కుటుంబ సభ్యులే తొండూరు మండలంలో 200 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమించి సాగు చేశారన్నారు. ప్రభుత్వ భూమి ని యాభై వేల రూపాయలు రేటు కట్టి కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేశారని అన్నారు. దీని

పైన విచారణ జరిగితే ఎమ్మార్వోలు రిజిస్టర్లు ఇంటికి పోతారన్నారు.
వైయస్ అవినాష్ రెడ్డి పిఎ  అంబాకపల్లి గ్రామంలో అటవి శాఖ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటురన్నారు.  వైయస్ అవినాష్ రెడ్డి ఆయన వెనకేసుకొస్తున్న వాళ్ళందరూ భూ ఆక్రమణలకు పాల్పడ్డారన్నారు. దేవిరెడ్డి

శంకర్ రెడ్డి దొడ్ల వాగు గ్రామంలో 30 ఎకరాల భూమిని ఆక్రమించారన్నారు. పులివెందుల మున్సిపల్ చైర్మన్ డికెటి భూములు ఆక్రమించారని ఆ భూమి తనది కాదంటే తాము నిరుపేదలకు ఆ భూములు

పంచుతామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరైనా భూ ఆక్రమణలు చేసి ఉంటే పులివెందుల ఆర్డీవో కు డిఎస్పీకి  తనకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.  పులివెందుల జరిగిన భూ ఆక్రమణల పై విచారణ

చేపిస్తామని తర్వలొ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తాను కానీ నా కుటుంబ సభ్యులు ఎవరైనా ఒక్క సెంటు భూ కబ్జా చేసినట్లు నిరూపిస్తే వైయస్ కుటుంబ సభ్యుల కు క్షమాపణ చెప్పి రాజకీయ నుంచి

తప్పుకుంటానన్నారు….

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular