మాలల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం
Malala's spiritual union is successfulడిసెంబర్ 1న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మరియు మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం సభలో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి , కే ఆర్ నాగరాజు పిలుపు.
ఖమ్మం :
ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మరియు మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం సభ కు ముఖ్యఅతిథిగా చెల్లూరు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి , వర్ధన్నపేట ఎమ్మెల్యే మరియు తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషయిన్ అఫ్ మాల టీం రాష్ట్ర అధ్యక్షులు కే ఆర్ నాగరాజు , మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జీ చెన్నయ్య లు హాజరైనరు . ఈ సభకు అధ్యక్షులుగా పల్లా రాజశేఖర్ అడ్వకేట్ , కన్వీనర్ గుంతేటి వీరభద్రం వహించారు. దీనిలో మాల ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ డి సర్వైయ్య , సమతా సైనిక్ దళ్ దేశ ఉపాధ్యక్షులు దిగంబర్ కాంబ్లే , టీం రాష్ట్ర కార్యదర్శి మేకల రవీందర్ , డాక్టర్ గోపీనాథ్ , భీమ్ ఫౌండేషన్ అధ్యక్షులు మందాల భాస్కర్ , ప్రముఖ గాయకులు రెంజర్ల రాజేష్ , పిల్లి బాలరాజు, తలమల హుస్సేన్ , ఉద్యోగుల సంఘం నాయకులు , జంగం లక్ష్మణరావు , ముత్తమాల ప్రసాదు కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించినారు . స్వర్ణకుమారి , విజయలక్ష్మి , డాక్టర్ బాబు రత్నాకర్ తదితరులు హాజరయ్యి ప్రసంగించినారు . ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నాయకులు హాజరైనారు . వీరితో పాటు వివిధ ప్రాంతాల నుండి మాల మహానాడు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరైనారు . మాలల ఆత్మగౌరవం కోసం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మాల అస్తిత్వానికి దెబ్బగా ఉండే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండి చైతన్యవంతమై , శక్తిని నిరూపించుకొని , మనకు రావాల్సిన హక్కులు సాధన కొరకు పోరాడాలని వక్తలు పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమం ఎవరికీ వ్యతిరేకం కాదని కేవలం మాలలు ఆత్మగౌరవం కోసమే ఉద్యమించాలని పలువురు తెలియజేశారు . దీనిలో జగన్ సాయిబాబ , సురేష్ , రత్తయ్య , శంకర్ , కృష్ణ శ్రీనివాస్ మొదలకు వారు హాజరైనారు .




