ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ ను నివారించవచ్చు
Cancer can be prevented with early screeningడాక్టర్ అరుణ్ కుమార్
పత్తికొండ
క్యాన్సర్ వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని పుచ్చకాయల మాడ పీహెచ్సీ వైద్యుడు అరుణ్ కుమార్ అన్నారు. క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్వేకార్యక్రమాన్ని శనివారం ఆయన పర్యవేక్షించారు . ఈ సందర్భంగా మండలంలోని పెద్దహుల్తి గ్రామంలో వైద్యాధికారి అరుణ్ కుమార్ వాణి ఎమ్మెల్ హెచ్ పివాణి బాయ్ ఆరోగ్య కార్యకర్త
రమేష్ మేల్ హెల్త్ అసిస్టెంట్
ఆశలు ధనలక్ష్మి సుశీల ఇంటింటికి వెళ్లి మూడు రకాల క్యాన్సర్,బి పి, షుగర్ వ్యాధులపై స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి అరుణ్ మాట్లాడుతూ క్యాన్సర్ పై విజయం సాధించాలంటే స్కీన్రింగ్ తోనే సాధ్యం అవుతుందన్నారు. పల్లె, పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకొని సర్వేలో భాగంగా తమ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలని కోరారు. భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమంలో వాణి ఎమ్మెల్ హెచ్ పివాణి బాయ్ ఆరోగ్య కార్యకర్త
రమేష్ మేల్ హెల్త్ అసిస్టెంట్
ఆశలు ధనలక్ష్మి సుశీల తదితరులు పాల్గొన్నారు.




