Wednesday, March 4, 2026

ముగిసిన గ్రూప్ 3 పరీక్షలు..సగం మందే పరీక్షకు హాజరు

- Advertisement -

ముగిసిన గ్రూప్ 3 పరీక్షలు..సగం మందే పరీక్షకు హాజరు

Ended Group 3 exams... Only Half appeared for the exam

హైదరాబాద్, నవంబర్ 18, (వాయిస్ టుడే)
హైదరాబాద్‌, నవంబర్ 12: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 పరీక్షలు ఆది, సోమ వారాలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 3 పేపర్లకు ఈ పరీక్షలు జరిగాయి. నవంబనఖ 17న ఉదయం సెషన్‌లో 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌ 1 పరీక్ష, అదేరోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష జరిగింది. ఇక నవంబర్‌ 18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌ 3 పరీక్ష నిర్వహించడంతో మూడు పేపర్లకు పరీక్షలు పూర్తయ్యాయి. మొత్తం 1,365 గ్రూప్‌ 3 సర్వీసు పోస్టుల భర్తీకి గానూ ఈ రాతపరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,401 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,36,400 మంది అభ్యర్ధులు గ్రూప్ 3కి దరఖాస్తు చేయగా.. వారిలో పేపర్‌ 1 పరీక్షకు 2,73,847 మంది, పేపర్‌ 2 పరీక్షకు 2,72,173 మంది హాజరయ్యారు. అంటే తొలిరోజు మొత్తం కలిపి 50.7 శాతం హాజరు నమోదైందని టీజీపీఎస్సీ తెలిపింది.పేపర్‌ 1 ప్రశ్నపత్రంలో నిర్ణీత సమయంలోగా అన్ని సమాధానాలు గుర్తించేందుకు సమయం సరిపోలేదని కొందరు అభ్యర్థులు వాపోయారు. మధ్యాహ్నం జరిగిన పేపర్‌ 2 పరీక్ష ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉందని వివరించారు.పేపర్‌ 1 పరీక్షలో ఆస్కార్‌ అవార్డుపై ఓ ప్రశ్న రావడం గమనార్హం. ఆస్కార్‌ అవార్డు-2024కు నామినేట్‌ చేయబడిన డాక్యుమెంటరీ చలనచిత్రం ‘టు కిల్‌ ఎ టైగర్‌’ (To Kill a Tiger)’ దర్శకుడు ఎవరు? అనేదే ఆ ప్రశ్న.. ఇందుకు ఆర్‌. మహదేవన్‌, నిఖిల్‌ మహాజన్, కార్తీకి గొన్సల్వ్స్‌, నిషా పహుజ ఆప్షన్లు ఇచ్చారు. సరైన సమాధానం.. నిషా పహుజ
‘ఇలా చేశారంటే ఏ సైబర్ నేరగాడు మిమల్ని ఏం చేయలేడు’
ఇలా కొన్ని ప్రశ్నలు నేరుగా సమాధానం గుర్తించేవిగా ఉండగా, మరికొన్ని లోతైన విశ్లేషణలతో కూడుకున్నవిగా ఉన్నట్లు తెలిపారు. గ్రూప్‌ 3 పరీక్ష పేపర్‌ 1, 2 ప్రశ్నపత్రాలు మధ్యస్థంగా ఉందని అభ్యర్థులు, నిపుణులు పేర్కొన్నారు. లాజికల్‌ రీజనింగ్‌, అనలిటికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ మినహా.. మిగిలిన అంశాల్లో ప్రశ్నలు చాలావరకు నేరుగానే అడిగారని తెలిపారు. కఠినస్థాయితో పాటు సులభ స్థాయి ప్రశ్నలు తక్కువగా, మధ్యస్థంగా ఉండే ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. ఈ రోజు జరిగిన పరీక్షకు ఎంత మంది అభ్యర్ధులు హాజరయ్యారనే విషయం ఇంకా తెలియరాలేదు.
మరో 3 రోజుల్లో కాన్పు
ఆమె 9 నెలల గర్భిణీ మహిళ. ఈనెల 21వతేది కాన్పుకు అవకాశాలు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అంతలోనే పరీక్షలు వచ్చాయి. తన లక్ష్యాన్ని చేరుకొనేందుకు పెద్ద సాహసమే చేసింది ఆ మహిళ. నిండు గర్భిణీగా ఉన్న ఆ మహిళ గ్రూప్ – 3 పరీక్షలకు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచింది.జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అరుణోదయ డిగ్రీ కళాశాలలో గ్రూప్ -3 పరీక్షలను అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. అయితే పరీక్షల సమయానికి ఓ మహిళ కంగారు కంగారుగా.. కేంద్రంలోకి వచ్చింది. ఆ మహిళ గర్భిణీ స్త్రీ కావడంతో, ఎవరమ్మా మీరు.. ఇక్కడ పరీక్షలు జరుగుతున్నాయంటూ.. అక్కడి సిబ్బంది తెలిపారు. దీనికి సమాధానంగా సదరు మహిళ.. తాను కూడా పరీక్ష రాసేందుకు వచ్చినట్లు తెలపడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.హైదరాబాదులోని ఆర్టీవో కార్యాలయంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బాలకృష్ణ సతీమణి రీనా. ప్రస్తుతం ఈమె కథలాపూర్ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 9 నెలల గర్భిణీ అయిన రీనా, గ్రూప్ – 3 పరీక్షలకు గతంలో దరఖాస్తు చేసింది. అయితే ఆదివారం గ్రూప్ – 3 పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో, నిండు గర్భిణీ రీనా పరీక్ష రాసేందుకు కోరుట్లలోని అరుణోదయ డిగ్రీ కళాశాలకు వచ్చారు. ఈ సందర్భంగా రీనా తన లక్ష్యసాధన కోసం ధైర్యంగా పరీక్షకు హాజరు కావడంపై అక్కడి అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు పరీక్షా కేంద్రం సిబ్బంది లిఫ్ట్ సహాయంతో, తన పరీక్ష గది రెండవ అంతస్థుకు ఆమెను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేశారు.పరీక్ష రాసిన అనంతరం రీనా మాట్లాడుతూ.. తాను మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పరీక్షలకు హాజరైనట్లు, పరీక్ష కేంద్రం సిబ్బంది తనకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఈనెల 21వ తేదీన కాన్పుకు అవకాశాలు ఉన్నట్లు తేదీని డాక్టర్లు ప్రకటించినట్లు ఆమె తెలిపారు. ఏది ఏమైనా తన లక్ష్యసాధన కోసం నిండు గర్భిణీ మహిళ అయినప్పటికీ, పరీక్ష రాసేందుకు వచ్చిన ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే అంటున్నారు తోటి అభ్యర్థులు. పరీక్షా ఫలితాలలో కూడా ఉన్నత మార్కులు సాధించాలని కోరుకుందాం

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్