Tuesday, December 3, 2024

మత్తు పదార్థాల నివారణకై పటిష్టమైన చర్యలు

- Advertisement -

మత్తు పదార్థాల నివారణకై పటిష్టమైన చర్యలు

Strong measures to prevent drug addiction

జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాఠశాలలు,కళాశాలలో మత్తు పదార్థాల నివారణపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహనా కార్యమాలు

ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలోని పాఠశాలలు మరియు కళాశాలలలో విద్యార్థిని,విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వలన వాటిల్లే నష్టాల గురించి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది యువత మత్తుకు బానిసలై తమ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని,మత్తు వలన విచక్షణ కోల్పోయి ప్రమాధాలకు గురవ్వడం,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం చేస్తున్నారని, అలాంటివారిలో మార్పు తీసుకురావడానికి పోలీస్ శాఖ తరపున అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను వినియోగించడం ద్వారా యువత భవిష్యత్తు నాశనం కాకూడదనే సదుద్వేశంతో పోలీస్ శాఖ తరపున ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు.అదే విధంగా పాఠశాలలు మరియు కళాశాలలో ర్యాగింగ్ వంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,జిల్లాలోని అన్ని స్కూళ్లు,కళాశాలలో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వ నిషేధిత గంజాయి అక్రమ రవాణా చేసినా,విక్రయించినా,వినియోగించడం లాంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.ఆ దిశగా పటిష్టమైన ప్రణాళికతో జిల్లాలోని పోలీసు అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా గురించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని జిల్లా ప్రజలను కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్