- Advertisement -
6 గ్యారంటీ పథకాలు సద్వినియోగం చేసుకోండి
Take advantage of 6 guarantee schemes
కమాన్ పూర్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సాంస్కృతిక కళామండలి కళాకారులు పాటల రూపంలో వివరించారు.
తెలంగాణ సాంస్కృతిక సారథి పెద్దపల్లి జిల్లా కళాకారులచే
ప్రగతి ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా కళాయాత్ర కమాన్ పూర్ మండలంలోని కమాన్ పూర్ రొంపికుంట జూలపల్లి గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలు మరియు ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల పైన విజయోత్సవ వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు చాలా ఉత్సాహంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు పాటల మాటల రూపంలో కళా ప్రదర్శనల ద్వారా ప్రచార వాహనములో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలు ఈనెల 19 నుండి డిసెంబర్ 7 వరకు ప్రతిరోజు రోజుకు మూడు గ్రామాల చొప్పున సాంస్కృతిక సారధి కళాకారులు జిల్లా వ్యాప్తంగా కళా ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమంలో సాంస్కృతిక సారథి కళాకారులు రచయిత గాయకులు దయా నర్సింగ్ టీం లీడర్ ఈదునూరి పద్మ
జనగామ రాజనర్సు కోండ్ర వెంకన్న గౌడ్ సాన గుండా రవీందర్ జిన్నారమదీకొండ శ్రావణ్ మంథని స్పందనజెన్నీ శ్వేత ఉప్పు స్పందనకళాకారుల బృందం పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామాల ప్రజలు పాల్గొనడం జరిగింది.
- Advertisement -