బాల్య వివాహాలను అరికట్టాలి
Prevent child marriagesఐసిడిఎస్ సూపర్వైజర్ పార్వతి
ఆళ్లగడ్డ
బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆళ్లగడ్డ రూరల్ ఐసిడిఎస్ సూపర్వైజర్ పార్వతి పిలుపునిచ్చారు. గురువారం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పట్టణంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఆవరణంలో సూపర్వైజర్ పార్వతి ఆధ్వర్యంలోఅంగన్వాడి కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాలు చేసుకోవడం వలన ఎన్నో అనార్థాలకు దారితీస్తుందన్నారు. బాల్య వివాహాలు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. ఎవరైనా బాల్య వివాహాలు చేసుకుంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.బాలికలకు విద్యా,భద్రత, తదితర వాటిపై అవగాహన కల్పించాలని కోరారు. బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లక్ష్మీదేవి తోపాటు అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




