- Advertisement -
సెప్టిక్ ట్యాంక్ వాహనదారుల అందోళన
Septic tank under motoristsఖమ్మం
మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ వాహనదారులు ఆందోళనకు దిగారు. ఎస్ ఎఫ్ టి క్లీనింగ్ ప్లాంట్ పనిచేయకపోవడం వల్ల సెప్టిక్ ట్యాంక్ వ్యర్ధాలను తరలించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. మూడు నెలల క్రితం వచ్చిన వరదల వల్ల ఎస్ ఎఫ్ టి ప్లాంట్ మునిగిపోయిందని అధికారులు దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్ వాహనాలను పెట్టి నిరసన ప్రకటించారు
- Advertisement -




