Thursday, December 5, 2024

నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో..

- Advertisement -

నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో..

Put as many illegal cases against me..

     మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్ డిసెంబర్ 3
;ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మరో్సారి నిప్పులు చెరిగారు. “నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. తగ్గేదే లేదు.. నిన్ను ప్రజా కోర్టులో శిక్షించే వరకు ఆగేది లేదు” అని ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ పై ఫైరయ్యారు. మంగళవారం పంజాగుట్ట పోలీసులకు హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హరీశ్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు హరీశ్ రావు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. సీఎం రేవంత్ తనపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారంటూ మండిపడ్డారు.“అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక.. నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం. రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించినవు. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించినవు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్ లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించినవు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డుమీద ఈకలు పీకి, తలాతోక లేని కేసొకటి మానకొండూరులో అక్రమ కేసు పెట్టించినవు. నీ రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్టేషన్ లో మరో తప్పుడు కేసు పెట్టించినవు. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను” అంటూ దుయ్యబట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్