నిన్న తెలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది- సింబాలిక్ గా- పుష్ప 2 రిలీజ్ కి సరిగ్గా ఒక్క రోజు ఉంది
అనగా.
Allu Arjun before Pushpa - after Pushpa ???మన తెలుగు సినిమా 12000 స్క్రీన్స్ లో చూపిస్తున్నారు అన్న గర్వంతో…
పక్క రాష్ట్రాల్లో / ఇతర దేశాల్లో మన సినిమాకు కొట్టే చప్పట్లు, వినిపించే ఈలలు నిజం గా ఆ కిక్కే వేరు. సినిమా మొదలయ్యి మూడున్నర గంటలు అయ్యింది.. ముగిసింది… ఇప్పుడేనా అనిపించింది… సుకుమార్ మాయ చేసి మంత్రం వేసి ఎక్కడి వాళ్ళను అక్కడ కట్టి పడేసినట్టు ఉంచాడు.. పుష్ప 1 అంతా అల్లు అర్జున్ తో పాటుగా అన్ని పాత్రల చుట్టూ సమంగా తిరుగుతుంది.- కానీ – పుష్ప 2 మాత్రం వన్ మాన్ షో- అదే అల్లు అర్జున్ చేసే మాయ. ఇంకో తేడా- పుష్ప 1 లో హీరో ఓడి పోతూ, గెలుస్తూ, ఓడిపోయి , గెలుస్తాడు. ఇక- రెండో పుష్ప లో హీరో కి అన్నీ విజయాలే- అదే తేడా- వేరే రోల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తే- అల్లు అర్జున్ చిన్న వాడవుతాడా? కాదు- కానీ- సునీల్, అనసూయ లాంటి వాళ్ళ ప్రెజెన్స్ తప్ప, కథ లో రోల్ లేదు. అల్లు అర్జున్ అనే హీరో అన్స్టాపబుల్ మిగిలిన హీరోలు నటించినట్టు ఉంటుంది.. కానీ అర్జున్ నటించి నట్టు ఎక్కడ అనిపించలేదు. రష్మిక సన్నివేశాలన్నీ ఫ్రేమ్ కట్టించి ఉంచొచ్చు. ప్రేమను ఎక్సప్రెస్ చేసే పధ్ధతి లో సో మచ్ క్రియేషన్. తన భార్య ప్రేగ్నన్ట్ అని తెలిసి- గంగమ్మ జాతర లో అర్జున్ చేసే డాన్స్ సూపర్ గా ఉంటుంది- ఒక్క నిమిషం గ్యాప్ గ్యాప్ లో వచ్చే రెండు పాటలు బాగా కుదిరాయి. రష్మిక అల్లు అర్జున్ లను చూస్తే కొత్తవాళ్లు ఎవరైనా నిజంగా భార్యా భర్తలు అనుకుంటారు..
భైరవ సింగ్ షెకావత్– … ఫైరింగ్ ది స్క్రీన్స్… హీరో కు ఏమాత్రం తగ్గలేదు.. ఒక్కోసారి మించి పోయాడు.. ఫాజిల్ ఫహద్ . రావు రమేష్ తనకి ఇచ్చిన రోల్ కి ఎప్పుడు అన్యాయం చేయలేదు.. అజయ్…. చివరి సన్నివేశంలో జీవించేసాడు.. బహుశా మూడో పుష్ప ది రాంపజ్ మూడో బాగానికి ప్రాణం పోసాడు… జగపతి బాబు… మూడోభాగంలో ఏమి చేస్తాడో కానీ ఇపుడు మాత్రం తన మార్క్ వదిలి పెట్టాడు…చివర్లో . రష్మిక తో ఫీలింగ్స్ వస్తున్నాయి అంటూ పెట్టిన సీన్లు- స్క్రిప్ట్ కి అవసరం లేదు- క ధ లో పట్టు ఉంది కాబట్టి- ఈ సీన్లు లాగ్ అనిపిస్తాయి.
100% లవ్, ఆర్య సిరీస్, రంగస్థలం లాంటి క్లీన్ సినిమాలు తీసి హిట్లు కొట్టిన, సుకుమార్ కి ఈ సీన్లు మీదా టేస్ట్ కొ త్త గా వచ్చినట్లుంది. హిందీ లో సందీప్ వంగ డైరెక్షన్ లో – ఈ మధ్య వచ్చిన యానిమల్ సినిమా సక్సెస్ చూసి, ఇలాంటి సీన్లు లీగాలిటీ సంపాదించుకున్నాయి. సినిమాలో ఒక్క పాత్ర వృధా కాదు.. ఒక్క మాట పొల్లు లేదు.. ఒక దృశ్యం అనవసరంగా లేదు.. మాటలు, మ్యూజిక్ సినిమాకు ప్రాణం… సినిమాలో ఎవ్వరు నటనకోసం వచ్చి వెళ్లినట్టు లేదు.. ఎక్కడో ఒక లైఫ్ నడుస్తుంది.. మనం దూరం నుండి చూస్తున్నట్టు ఉంది… మరో విషయం.. ఈ సినిమాలో పైన చెప్పిన అందరికంటే…. అన్నిటి కంటే… ఈ సినిమా ఈ రేంజ్ లో ఎలేవేట్ కావటానికి మరో ముఖ్య కారణం… పుష్పరాజ్ క్యారెక్టర్… సుకుమార్ విజయం అంతా ఆ క్యారెక్టర్ ను అర్థం చేసుకోవటం లోనే ఉంది… పుష్పతో చిత్ర0 యూనిట్ కు అభినందనలు… తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు…
అల్లు అర్జున్ కి పుష్ప ముందు – పుష్ప తర్వాత ??? ఈ రేంజ్ స్టామినా ఉన్న కథతోనే నెక్స్ట్ రావాలి- అదే ఛాలెంజ్ సుకుమార్ కి కూడా. ఫైనల్ గా –
“లాంగ్ లివ్ తెలుగు సినిమా”🌷🌺🌹✔️ – సత్య కేశరాజు




