డమాస్కస్‌ను ఆక్రమించుకున్న తిరుగుబాటుదారులు..

- Advertisement -

డమాస్కస్‌ను ఆక్రమించుకున్న తిరుగుబాటుదారులు..

Rebels occupying Damascus

      దేశం విడిచి పారిపోయిన సిరియా అధ్యక్షుడు!
డామస్కాస్‌ డిసెంబర్ 8
: అంతర్యుద్ధంతో అట్టుకుతున్న సిరియాలో   అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌కు ఓటమి తప్పేలా లేదు. ఒక్కోనగరాన్ని చేజిక్కించుకుంటూ వస్తున్న తిరుగుబాటుదారులు ఏకంగా రాజధాని డమాస్కస్‌కు  చేరుకున్నారు. ప్రభుత్వ బలగాల నుంచి ఎలాంటి ప్రతిఘటనా లేకపోవడంతో రాజధానిని ఆక్రమించుకున్నారు. చేజిక్కించుకునే అవకాశం ఉన్నది. డమాస్కస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రం నుంచి సిరియా బలగాలు వెనుతిరిగాయి. కాగా, 2018 తర్వాత రాజధాని సమీపంలోకి తిరుగుబాటుదారులు చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు అసద్‌ రాజధానిని విడిచి పారిపోయారు. విమానంలో గుర్తుతెలియని ప్రాంతానికి వెళ్లారని ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే ఆయన రష్యాకు చెక్కేశారన్న వార్తలను ప్రభుత్వ దళాలు ఖండించాయి.ఉత్తర సిరియాపై హయాత్‌ తహరీర్‌ అల్‌-షామ్‌ (HTS‌) నేతృత్వంలోని తిరుగుబాటుదళాలు పట్టుబిగిస్తుంటే, దక్షిణ సిరియాలోని పరిస్థితి కూడా అసద్‌ వ్యతిరేకంగా మారింది. కీలక నగరమైన దారాతోపాటు స్వీడియా తదితర ప్రాంతాల నుంచి సిరియా సైన్యాలు శనివారం వైదొలగడం వల్ల అవి తిరుగుబాటుదారుల వశమయ్యాయి. ఇక, డమాస్కస్‌ శివారు ప్రాంతాలైన మదామియా, జరామానా, దరాయల్లో తిరుగుబాటుదారుల కదలికలు కనిపిస్తున్నాయని పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular