- Advertisement -
ములుగు జిల్లాలో పెద్దపులి కలకలం
Peddapuli Kalakalam village in Mulugu districtములుగు
వెంకటాపురం మండలం ఆలుబాక శివారులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. ఆలుబాక- బోధపురం మిర్చి తోటకు వెళ్ళే గోదావరి పాయలో పెద్దపులి అడుగుజాడలు ఉండడంతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. రాత్రి సమయంలో పుచ్చతోట దగ్గర పడుకున్న రైతులకు పులి అరుపులు వినిపించినట్టు సమాచారం. ఉదయం ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకుని పెద్దపులి అడుగులను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పెద్దపులి జాడ దొరికే వరకు పరిసర ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు
- Advertisement -




