కాంగ్రెస్ తల్లి వద్దు.. తెలంగాణ తల్లి ముద్దు..

- Advertisement -

కాంగ్రెస్ తల్లి వద్దు.. తెలంగాణ తల్లి ముద్దు..

Don't want Congress mother... we want Telangana mother...

— నమిలికొండలో చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

చొప్పదండి

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని  నమిలి కొండ గ్రామంలో  తెలంగాణ తల్లి విగ్రహానికి మంగళవారం బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో   చొప్పదండి తాజా మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పలువురు బీ ఆర్ ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలోనే కెసిఆర్  తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా  భరతమాత ఏ విధంగా భారతదేశానికి ఉందో  అలాగే తెలంగాణకు కూడా తెలంగాణ తల్లి ఉండాలని  కవులు కళాకారులు మేధావులతో మేథో మధనం చేసి తెలంగాణ ప్రజల బతుకులో భాగమైన బతుకమ్మను, అనేక రకాల అంశాలను జోడించి  తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కేసిఆర్ ఆనవాళ్లను లేకుండా చేయాలనే దుర్మార్గపు ఆలోచన చేసి  తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ తల్లిగా ఏర్పాటుచేసి మన బతుకులు భాగమైన బతుకమ్మను  తొలగించి ఇలా చేయడం సరికాదన్నారు.కెసిఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో  ఉన్నాడని  కెసిఆర్  ను తెలంగాణను వేరువేరుగా చూడలేమన్నారు.కాంగ్రెస్ తల్లి వద్దు తెలంగాణ తల్లి ముద్దు అని.. జై తెలంగాణ జై కేసీఆర్ అని  నాయకులు కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.
ఈ కార్యక్రమంలో కొడిమ్యాల బారాస మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, కొండగట్టు దేవస్థానం తాజా మాజీ డైరెక్టర్ ఒల్లాల లింగాగౌడ్, నాయకులు మల్యాల నరేష్, చింతపండు ఆదయ్య,మల్యాల లింగయ్య,పరదేశి, కొత్తూరి, స్వామి, అంజన్ కుమార్,చాంద్ పాషా,ప్యాట అంజి,రోడ్డ శరత్, మొగిలిపాలెం రమేష్,గాదే స్రవంతి శ్రీనివాస్,రాచకొండ చందు,అఖిల్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular