- Advertisement -
నాన్న అంటే నాకు ప్రాణం..మా నాన్న దేవుడు
Father means life to me..my father is Godమంచు మనోజ్
హైదరాబాద్
నాన్న అంటే నాకు ప్రాణం..మా నాన్న దేవుడు. మా నాన్న ను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారని నటుడు మోహన్ బాబు కుమారుడు మంచి మనోజ్ అన్నారు. మా నాన్న దృష్టిలో నన్ను శత్రువు గా చిత్రీకరించారు. నేను నా భార్య కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టాము. వాటికి కూడా అడ్డంకులు సృష్టించారు. నా పై దాడులు చేశారు..మా నాన్న ముందే నన్ను కొట్టారు. నాకు సపోర్ట్ చేస్తున్న మా అమ్మ ను కూడా డైవర్ట్ చేశారు. మూడు రోజులు బయటకు వెళ్ళు, మనోజ్ కి సర్ధిచెప్తాం అని మా అమ్మను కూడా నమ్మించారు. మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా. మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింది. నా భార్య, ఏడు నెలల కూతురి పేరు లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
- Advertisement -




