- Advertisement -
ధాన్యాన్నివెంటనే కొనుగోలు చేయాలి
Grain should be purchased immediatelyమాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం నాడు పాత సూగూర్ గ్రామ ధాన్య కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. తరువాత అక్కడి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అని అన్నారు.
ధాన్యం తీసుకొచ్చి వారం అయిన కొనుగోలు చేయలేదని చూసి,చూసి దళారులకు అమ్మాల్సివస్తుందని రైతులు అన్నారు.బోనస్, రుణ మాఫీ,రైతు భరోసా కు దిక్కులేదనీ మా తరుపున ప్రభుత్వంతో పోరాడాలని ప్రాధేయపడ్డారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతులనుంచి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు. తరువాత అయనను రైతులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పరుశురాం,మధు,దశరథ్,రాముడు,పులి ,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




