- Advertisement -
గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు సత్వర పరిష్కారం…తహసిల్దార్ రమాదేవి
Quick solution land problems through village revenue conferencesTehsildar Ramadeviతుగ్గలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని తుగ్గలి తహసిల్దార్ రమాదేవి తెలియజేశారు.బుధవారం రోజున తుగ్గలి మండల పరిధిలోని గల చెన్నంపల్లి గ్రామంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సచివాలయం సిబ్బంది నేతృత్వంలో గ్రామ రెవెన్యూ సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లు రాష్ట్ర ప్రజల యొక్కభూమి రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమే గ్రామాలలోని గ్రామ సచివాలయాలలో పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో గ్రామ రెవెన్యూ సదస్సును నిర్వహించడం జరిగిందని,ప్రజల యొక్క భూమి సమస్యలను ఆన్లైన్ లో పరిష్కరించుకునే అవకాశం గ్రామాలలో ఏర్పాటు చేయడం సంతోషమని వారు తెలియజేశారు.చెన్నంపల్లి గ్రామ దూదేకుల సత్తార్ వలి 606 సర్వే నంబర్ నందు గల రెండు ఎకరాల భూమి 35 సంవత్సరాలుగా సాగు చేస్తున్నామని, ఈ భూమి సంబంధించి పట్టాను తనకు మంజూరు చేయాలని తహాసిల్దార్ కు రెవెన్యూ సదస్సులో వినతిపత్రాన్ని ఆయన అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, మండల డిప్యూటీ తహశీల్దార్ నాగరాజు,మండల సర్వేయర్ సుధాకర్, గ్రామ వీఆర్వో కృష్ణారెడ్డి,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, చెన్నంపల్లి మరియు రామలింగాయపల్లి గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




