Friday, February 27, 2026

ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సినే కారణమా

- Advertisement -

ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సినే కారణమా

Is covid vaccine responsible for sudden deaths?

ముంబై, డిసెంబర్12, (వాయిస్ టుడే)
కోవిడ్19 మహమ్మారి రెండేళ్ల పాటు విలయతాండవం చేసింది.. కోట్లాది మంది ఈ వైరస్ బారిన పడగా.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత.. భారతదేశంలో ఆకస్మిక గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఈ మరణాలకు కరోనా వ్యాక్సిన్ ప్రధాన కారణమని ప్రజల్లో అపోహ నెలకొంది.. కోవిడ్ వ్యాక్సిన్ గురించి ప్రచురించిన కొన్ని అధ్యయనాలతో ప్రజలు గుండె పోటు మరణాలకు అదే కారణమని భావిస్తున్నారు.. అయితే, దేశంలో గుండెపోటు కారణంగా ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రధాన కారణం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆకస్మిక మరణాలకు కరోనా వ్యాక్సిన్ కారణం కాదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఇందుకోసం భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పరిశోధనలను కూడా ఆరోగ్య మంత్రి రాజ్యసభలో సమర్పించారు.దేశంలో గుండెపోటు కారణంగా ఆకస్మిక మరణాలకు కరోనా వ్యాక్సిన్ కారణం కాదని (ఐసీఎంఆర్)  పరిశోధనలో పేర్కొంది. ఇలాంటి మరణాలకు 5 అంశాలు కారణమని నివేదికలో పేర్కొన్నారు. (ఐసీఎంఆర్)   నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యవంతమైన వ్యక్తులపై ఒక అధ్యయనం నిర్వహించింది.ఈ పరిశోధన 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 47 ఆసుపత్రులలో నిర్వహించింది. (ఐసీఎంఆర్)   పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న.. ఎటువంటి వ్యాధి లేని వ్యక్తులను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదికను తయారు చేసింది. దీనిలో అక్టోబర్ 1, 2021 – మార్చి 31, 2023 మధ్య తెలియని కారణాల వల్ల కొందరు హఠాత్తుగా మరణించినట్లు తెలిపింది. ఈ విశ్లేషణలో మొత్తం 729 ఆకస్మిక మరణాలు గురించి వివరించింది.కరోనా వ్యాక్సిన్‌తో దేశంలోని యువత, పెద్దలలో ఆకస్మిక మరణాల ప్రమాదం పెరగదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అధ్యయనం ద్వారా స్పష్టమైందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పార్లమెంటుకు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ అటువంటి మరణాల సంభావ్యతను తగ్గిస్తుందని ఈ అధ్యయనం చూపిస్తుంది.గత కొన్నేళ్లుగా దేశంలో ఆకస్మిక మరణాలకు కరోనా వ్యాక్సిన్ కారణమనే భయాందోళనలను దృష్టిలో ఉంచుకుని (ఐసీఎంఆర్)  ఈ పరిశోధనను నిర్వహించింది. (ఐసీఎంఆర్)  తన పరిశోధనలో 19 రాష్ట్రాలు – కేంద్రపాలిత ప్రాంతాలలో 47 ఆసుపత్రులలో ఈ పరిశోధనను నిర్వహించింది..పరిశోధన సమయంలో.. (ఐసీఎంఆర్)  అకస్మాత్తుగా మరణించిన 729 కేసులను శాంపిల్స్‌గా తీసుకుంది.. అయితే మొత్తంగా 2916 నమూనాలు తీసుకోన్నారు.. కొందరు గుండెపోటు వచ్చిన తర్వాత బతికి ఉన్నట్లు తెలిపారు. ఒకటి లేదా రెండు డోస్‌ల కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎటువంటి కారణం లేకుండా ఆకస్మిక మరణం సంభవించే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధనలో వెల్లడైంది.క‌రోనా వ్యాక్సినేష‌న్ దుష్ప్రభావాలను గుర్తించేందుకు అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ (ఏఈఎఫ్‌ఐ) పేరుతో ఒక నిఘా వ్యవస్థను కూడా రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా తెలిపారు. టీకా కేంద్రాలలో అనాఫిలాక్సిస్ కిట్‌లు అందుబాటులో ఉంచామన్నారు.. టీకా వేసిన తర్వాత, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 30 నిమిషాల పాటు పరిశీలనలో ఉంచబడతారని వివరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్