క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురండి

- Advertisement -

క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురండి

Bring a good name to the police department by performing duties with discipline

పోలీసు శాఖలో హోంగార్డుల సేవలు అభినందనీయం
అన్నమయ్య
రాయలసీమ రీజినల్ హోంగార్డ్స్ కమాండెంట్ శ్రీ . యం. మహేష్ కుమార్ గారు..
మదనపల్లి పట్టణం బీటీ కాలేజ్ మైదానం లో  జరిగిన  హోంగార్డుల పరేడ్ ను  కర్నూలు రీజనల్ హోంగార్డ్స్ కమాండెంట్ యం .మహేష్ కుమార్  తనిఖీ చేసి, దర్బార్ కార్యక్రమం నిర్వహించారు..
ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు అభినందనీయమని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ మంచి పేరు తీసుకురావాలని అన్నారు.  హోంగార్డుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు.  అప్రమత్తంగా ఉండాలి.  రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడాలన్నారు.  కుటుంబాల గురించి ఆలోచించాలన్నారు.  ఇన్సూరెన్స్ (బీమా) చేసుకోవాలన్నారు, సంవత్సరానికి ఒకసారి మెడికల్ చెకప్ చేసుకోవాలన్నారు ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.
హోంగార్డ్స్ ల దైనందిన విధులు సవాళ్లతో కూడుకున్నవేనన్నారు. ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యాంగా ఉన్నపుడే సమర్ధవంతంగా విధులు నిర్వర్తించడానికి వీలవుతుందన్నారు. విధుల్లో నైపుణ్యాన్ని  బాగా మెరుగుపరుచుకోవాలని పలు మెళకువలు సూచించారు. డ్రిల్ , కవాతు, ప్రముఖుల బందోబస్తు, ట్రాపిక్ తదితర విధులు మరింత సమర్థవంతంగా ఎలా నిర్వహించవచ్చో దిశానిర్ధేశం చేశారు. హోంగార్డ్స్ సంక్షేమంలో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్నామని కమాండెంట్   తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular