Thursday, December 12, 2024

సీఎంకి పొద్దుగాల చాయి ఇచ్చేవారు ఆయన హామీలను ఒకసారి గుర్తు చేయండి

- Advertisement -

సీఎంకి పొద్దుగాల చాయి ఇచ్చేవారు ఆయన హామీలను ఒకసారి గుర్తు చేయండి

Those who give greetings to the CM should remind him of his promises once

సిద్దిపేట కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు
సిద్దిపేట
సిద్దిపేట కలెక్టరేట్ ముందు సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే దీక్షలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గోన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షకు అయన  మద్దతు తెలిపారు.
హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అన్నాడు.  కేసిఆర్ ను అధికారం నుంచి దించడానికి ఒక గంట ఎక్స్ట్రా పని చేయాలని మిమ్మల్ని అడిగాడు రేవంత్ రెడ్డి.
అధికారంలోకి వచ్చిన నెలలో సెక్రటేరియట్లో కూర్చొని చాయ్ తాగుతూ సమస్య పరిష్కరించుకుంటామన్నావు కదా రేవంత్ రెడ్డి, ఇంకా నెల కాలేదా? రేవంత్ ఆయన ఇంట్లో వాళ్ళు ఆ సంగతి గుర్తు చేయాలి.  మొదటి సంతకంతో రైతుల రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేసిండు.  నాలుగు కోట్ల మంది ప్రజలను మోసం చేసిండు రేవంత్ రెడ్డి. మూడు కోట్ల మంది దేవుళ్లపై ఒట్టు పెట్టి వాళ్ళను కూడా మోసం చేసిండు. బాండ్ పేపర్ల మీద రాసి హామీల అమలు చేస్తామని ప్రజలను మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి.  రైతులకు 15000 రైతు భరోసా అన్నాడు. 4000 ఆసరా పెన్షన్ అన్నాడు. 2500 మహిళలకు ఇస్తామన్నాడు.. అన్ని వర్గాలను మోసం మోసం చేసిండని మందిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్న రైట్ టు ఎడ్యుకేషన్ ఆక్ట్ ఎందుకు అమలు చేయడం లేదు.? వరంగల్ ఏకశిలా పార్కు ముందు ధర్నా చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులకు సెప్టెంబర్ 13 నాడు హామీ ఇచ్చావు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తానన్నావు కదా.  నువ్వు చెప్పిన మాటలే ఎందుకు మర్చిపోయావు? నువ్వు ఇచ్చిన మాటను గుర్తు చేసేందుకు ఇంద్ర పార్క్ వద్ద ధర్నా చేస్తే అరెస్టు చేశావు.  అసెంబ్లీ ముట్టడి చేస్తే అరెస్టు చేసి మహిళల అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లో పెట్టావు.  ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ఘనంగా చెప్తావు. నువ్వు ఇచ్చిన హామీ నీకు గుర్తు చేస్తే అరెస్టు చేస్తావు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? వెంటనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను పిలిచి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
ఏడాది పాలనలో నీ పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. అని అంటే కేసు పెట్టావు. రుణమాఫీ ఎగబెట్టినవ్, రైతు భరోసా  ఎగపెట్టినవ్, 4000 ఆసరా పెన్షన్లు ఎగబెట్టినవ్, మహిళలకు 2500 ఎగ్గొట్టినవ్,  నువ్వు ఇచ్చిన అన్ని హామీలు ఎగ్గొట్టినవు కాబట్టి నీ పేరు ఎగవేతల రేవంత్ రెడ్డి.  నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తా .నువ్వు ఒక కేసు కాదు లక్ష కేసులు పెట్టినా నీ పేరు ఎగవేతల రేవంత్ రెడ్డినే. కనీసం విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టే పరిస్థితి లేదు.  గురుకుల పాఠశాలలో విషాహారం తిని 49 మంది విద్యార్థులు ఇప్పటివరకు చనిపోయారు.  విద్యార్థులకు పెట్టే అన్నం మెస్ బిల్లులను విడుదల చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 15% విద్యకు బడ్జెట్ పెడతామని 7.4% బడ్జెట పెట్టారు. 2500 స్కూళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో మూతపడ్డాయి.  25వేల మెగా డీఎస్సీ అని చెప్పి మోసం నిరుద్యోగులను మోసం చేశారు. విద్యా వలంటీర్లను పూర్తిగా తొలగించారు.సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను పట్టించుకోవడం లేదు.  ప్రజలను ముంచి విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటు.  ఒక గంట కాదు నాలుగు గంటలు ఎక్స్ట్రా పని చేద్దాం ఈ ముఖ్యమంత్రి మెడలు వంచుదామని అన్నారు.
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా చూపుదాం.  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ ను చిత్తుచిత్తుగా ఓడిద్దాం.  ఈనెల 16వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ    నిలదీస్తాం. సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్