- Advertisement -
గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీ న్ స్ స్ అమలు—పోలీస్ కమిషనర్
Enforcement of Section 163 BNS at Group-II Examination Centers Police Commissioner
ఖమ్మం
కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 15 నుండి 16 వరకు జరిగే టీ జి పి స్ సి గ్రూప్-II పరీక్షల నేపథ్యంలో అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీ న్ న్ స్ యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
డిసెంబర్ 15 నుండి 16 వరకు 85 పరీక్షా కేంద్రాలలో నిర్వహించే గ్రూప్- II పరీక్షల సందర్భంగా డిసెంబర్ 15 ఉదయం 6:00 గంటల నుంచి డిసెంబర్ 16 సాయంత్రం 6:00 వరకు అంక్షాలు అమలులో ఉంటాయని, పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని, ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, దర్నలు, ప్రచారాలు నిర్వహించరాదని పెర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలని సూచించారు. ట్రాఫిక్ ఆంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా పరిక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు తెలిపారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు నిఘాను నియమించి సమాచారం సేకరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
- Advertisement -