- Advertisement -
షీటీం, స్నేహిత కార్యక్రమాలపై సమీక్ష
A review of she team and friendly programs
సిద్దిపేట
షీటీమ్, భరోసా స్నేహిత సిబ్బంది నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలపై కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
కమిషనర్ మాట్లాడుతూ పిల్లల, మహిళల రక్షణకు మేమున్నామని భరోసా కల్పించాలి. స్కూల్ లలో పనిచేసే ఉపాధ్యాయులకు షీటీమ్ నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలియపరచాలి . హాట్స్పాట్స్ వద్ద, స్కూల్ లలో మరిన్ని ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలి. ఫిర్యాది బాక్సులో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి. హాట్స్పాట్స్ పై నిఘా మరింత పెంచాలి . మహిళలను పిల్లలను కావాలని ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మౌనం వీడి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు,
సంబంధిత స్కూల్ టీచర్లు కూడా స్కూల్ కు వచ్చే అమ్మాయిలలో ఏమైనా ప్రవర్తనలో మార్పు వస్తే వెంటనే సంబంధిత షీటీమ్ సిబ్బందికి తెలియపరచాలి. వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రీల్స్ తదితర సోషల్ మీడియాలను చూడకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ అమ్మాయిల విషయంలో ఏదైనా సంఘటన జరగకముందే సంఘటన జరగకుండా కౌన్సిలింగ్ చేయడం చాలా ముఖ్యమని తెలిపారు. అమ్మాయిల మైండ్ సెట్ మారే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. యుక్త వయసులో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తును అందాకారం లోకి నెట్టేస్తాయి.
షీటీమ్ భరోసా సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఫోక్సో కేస్ స్టడీ లను తెలియపరచి అవగాహన కల్పించాలని సూచించారు. ఈవిటీజింగ్ జరిగే హాట్స్పాట్ వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ప్రతిరోజు స్కూల్లో కాలేజీలు తదితర ప్రాంతాలలో మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి మహిళల భద్రత గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. హాట్స్పాట్ పరిసర ప్రాంతాలలో షీటీమ్ కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేయాలని మహిళా ఇన్స్పెక్టర్ దుర్గా కు సూచించారు. షీటీమ్ జిల్లా నెంబర్, మరియు షీటీమ్ సిబ్బంది నెంబర్లు కాలేజీలు స్కూల్ ల వద్ద పిల్లలకు కనబడే విధంగా చిన్న చిన్న బోర్డ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా దేవాలయాలు, కోమటి చెరువు, పాండవుల చెరువు, ఆక్సిజన్ పార్క్, రాజీవ్ పార్క్, అర్బన్ పార్క్,, బస్టాండ్ల వద్ద, స్కూల్లో కాలేజీల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. భరోసా సెంటర్ సిబ్బంది కూడా తరచుగా షీటీమ్ కార్యక్రమంలో పాల్గొని మైనర్ అమ్మాయిలకు అందిస్తున్న సేవలు గురించి వివరించాలని సూచించారు. ప్రజల రక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు.
- Advertisement -