- Advertisement -
కొనసాగుతున్న సమగ్ర శిక్షా అభియాన్ సిబ్బంది సమ్మె
Ongoing Samagra Shiksha Abhiyan staff strikeవికారాబాద్
సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎనిమిది రోజులుగా సమ్మె బాటపట్టారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన దీక్ష చేస్తున్నారు ఉద్యోగులు. సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షకు మద్దతుగా పీఆర్టీయూ నాయకులు దీక్షలో పాల్గొన్నారు . సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం నేరవేర్చాలని ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి.
సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమానం పనికి సమాన వేతనం తో పాటు పే స్కైల్, రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఆడ బిడ్డలు వారం రోజులుగా రోడ్డు పై కూర్చొని ఆందోళన చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని, సీఎం రేవంత్ రెడ్డి పై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఎప్పటికైనా తమను రెగ్యులర్ చేస్తారని మహిళా ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు.
- Advertisement -




