ఆయిల్ ఫాం సాగు లక్ష్యాన్ని చేరాలి

- Advertisement -

ఆయిల్ ఫాం సాగు లక్ష్యాన్ని చేరాలి

The target of oil farm cultivation should be met

సిద్దిపేట
ఆయిల్ ఫాం సాగు ఈ సంవత్సర లక్ష్యాన్ని తప్పనిసరి గా చేరేలా పనిచేయ్యాలని  జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి జిల్లా లోని ఆయిల్ ప్రేడ్ వ్యవసాయ మరియు ఉద్యాన వన శాఖల అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా లోని ఆయిల్ ప్రేడ్, వ్యవసాయ మరియు ఉద్యాన వన శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ముందుగా  జిల్లాలో ఇప్పటి వరకు 12,200 ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగవుతుందని అలాగే 2024-25సంవత్సరానికి గాను 4000ఎకరాల లక్ష్యం పెట్టుకొని ఈ సంవత్సరం  1817 ఎకరాలు డిడిలు కట్టించగా అందులోను 1020 ఎకరాల్లో మొక్కలు పెట్టడం  పుర్తైయ్యుందని తెలిపారు.ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫాం సాగు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని జిల్లాకు ఇచ్చిన  లక్షాన్ని తప్పనిసరిగా పూర్తి చెయ్యాలి. అలాగే ఆయిల్ పాం కర్మాగారం సైతం వచ్చే ఏడాది మార్చి నెల లోపూ పూర్తి అవుతుంది.  క్షేత్ర స్థాయులో అధికారులు రైతుల ఇంటికి వెళ్ళి ఆయిల్ పాం వల్ల కలిగే లాభాలు తెలుపి ప్రేరణ కల్పించాలి. గ్రామాల్లో అయిల్ ఫాం సాగు గుర్చి పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యాలి. ఆయిల్ పాం సాగులో దశలు రైతులను ఎంపిక చెయ్యడం, డిడి కలెక్షన్లు, మార్కింగ్, డ్రిప్ ఫిట్టింగ్, మొక్కలు పెట్టడం అనే పక్రియను వెంటవెంటనే పూర్తి చెయ్యాలి.మీ మండలాలోని పనిలో వెనకబడిన క్లస్టర్ల ను రోజువారీ పర్యవేక్షణ చేసి ఆయా క్లస్టర్ లలో రైతులతో వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారులు మీటింగ్ లు పెట్టాలి. పెద్ద భూస్వామూలనే కాకుండా చిన్న, సన్న కారు రైతులను కూడా ఆయిల్ ఫాం వైపు మళ్ళించాలి. వ్యవసాయ శాఖ, ఉద్యాన వన శాఖ, ఆయిల్ ప్రేడ్ కార్పొరేషన్ అధికారులు అందరు సమన్వయంతో 100% పూర్తి లక్ష్యాన్ని చేరేవిధంగా పని చేయ్యాలని అదికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాదిక, ఉద్యాన వన శాఖ అధికారి సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular