ఆరెంజ్ ట్రావెల్స్ కు రూ4,43,000/- జరిమానా…

- Advertisement -

ఆరెంజ్ ట్రావెల్స్ కు రూ4,43,000/- జరిమానా…

Orange Travels fined Rs 4,43,000/-

డోన్
ఆరుణాచల్ రాష్ట్రనికి చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ కు యం వి ఐ క్రాంతికుమార్ 4,43,000/-రూపాయలు భారీ జరిమానా విధించారు,స్థానిక డోన్ బై పాస్ హై వే లో శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలనుండి మాక్స్ 4 హోటల్ వద్ద నిర్వహించిన  సాధారణ తనిఖీలలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ కు సంబంధించిన  ఏ ఆర్ 01జి4158 నెంబర్ గల బస్ లో 35 మంది ప్రయాణీకులతో ఖమ్మం నుండి బెంగళూరు వెళ్తుండగా ఆపి తనికి చేయడం జరిగినది, రాష్ట్రానికి కట్టవలసిన రోడ్ టాక్స్ కట్టకుండా తిరుగుతున్నట్టు గుర్తించి 4,43,000/-(నాలుగు లక్షల నలభై మూడువేలరూపాయల జరిమానా విధించి డోన్ ఆర్టీసీ డిపో కు తరలించడం జరిగినది,ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా బెంగళూరు వెళ్తున్న ఇతర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో తరలించడం జరిగినది,
వీటితోపాటు పర్మిట్ లు లేని వాహనాలు మరియు ఓవర్లోడ్ తో వెళుతున్న వాహనాలకు రూ 82000/- ఎనబయి రెండువేల రూపాయల జరిమానా విధించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular