- Advertisement -
జైలు వెనుక గేటునుంచి బయటకు వచ్చిన బన్నీ
Bunny came out of the prison through back gate
హైదరాబాద్
చంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల అయ్యారు. చంచల్గూడ జైలు వెనుక గేటు నుంచి అల్లు అర్జున్ను అధికారులు పంపించారు. ఎస్కార్ట్ వాహనం ద్వారా నివాసానికి అల్లు అర్జున్ను పంపించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్ అరెస్టు అయ్యారు. అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ వచ్చినా రాత్రంతా జైలులోనే అల్లు అర్జున్ ఉన్నారు. ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇవాళ విడుదలయ్యా రు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 18 మందిని నిందితులుగా చేర్చగా, ఇందులో ఏ11గా అల్లు అర్జున్ ఉన్నారు.జైలు నుంచి విడు దలైన అనంతరం అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి ఇంటికి బయల్దేరారు. సుమా రు గంటకు పైగా గీతా ఆర్ట్స్ కార్యా లయంలోనే ఉన్నారు. 45 నిమిషా లపాటు న్యాయవాదుల బృందంతో చర్చలు జరిపారు. తరువాత అభి మానులకు అభివాదం చేసుకుం టూ వాహనం ఎక్కారు. అక్కడ నుంచి జూబ్లీహిల్స్లోని నివాసానికి చేరుకున్నారు. సతీమణి, పిల్లలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకు న్నారు. అల్లు అర్జున్ను చూసి కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఇంటి వద్ద అభిమానులకు అభివాదం చేశారు.
- Advertisement -