- Advertisement -
ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖల నిర్వహణలో వైఫల్యం
Failure of Chief Minister to manage the departments
మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థిని లలావతిని మాజీ మంత్రి హరీష్ రావు, మండలిలో ప్రతిపక్ష నేత ఎల్వోపీ మధుసూదన్ చారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ శనివారం పరామర్శించారు.
హరీష్ రావు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ నెల 10న కిచిడీ తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మంచి ఆసుపత్రికి పంపకుండా హాస్టల్ లో ఉంచి వారికి చికిత్స అందించారు. నాలుగు రోజులు గడించింది. అయినా వారు పూర్తి ఆరోగ్యవంతులు కాలేదు. విద్యార్థిని లీలావతిని నిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి..మౌనంగా ఇలా నిమ్స్ ఆసుపత్రి బెడ్ పై ఉండటం చూస్తే మనస్సు కలిచివేస్తున్నదని అన్నారు.
ఆ విద్యార్థిని త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వ నిర్లక్ష్యం అభం, శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నది. వాంకిడి గురుకుల విద్యార్థులకు చికిత్స అందించడంలో జరిగిన వైఫల్యం ఇక్కడ కనిపిస్తున్నది. మొన్న శైలజ మృతికి ప్రభుత్వం కారణం అయ్యింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాదు, కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను సైతం పట్టించుకోని నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి. గురుకులల్లో ఫుడ్ పాయిజన్ అభం శుభం తెలియని విద్యార్థులకు శాపం అవుతున్నదని ప్రాణాలను బలిగొంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని సార్లు చెప్పినా అర్థం కావడం లేదు. విద్యా మంత్రి, ఎస్సీ, ఎస్టీ మంత్రి కూడా రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖల నిర్వహణలో వైఫల్యం వుంది. చూడడానికి వెళ్తే ప్రతి పక్ష నాయకులను అడ్డుకుంటారు. సబితా ఇంద్రా రెడ్డి, , సత్యవతి ని అరెస్టు చేశారు. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడం పై ఉన్న ధ్యాస, కనీసం జిల్లాలో ఉన్న పిల్లల భవిష్యత్తు పై లేదా? నిన్న నల్గొండ – కేతేపల్లి మండలం గురుకులంలో ఐదో తరగతి చదువుతున్న నీలం సాయి గణేష్ పాము కాటుకు గురయ్యాడు. ఆసుపత్రి పాలయ్యాడు. ఫుడ్ పాయిజన్ కేసులు, కుక్క కాట్లు, పాము కాట్లు, ఎలుక కాట్లు, కరెంటు షాకులు నిత్య కృత్యం అవుతున్న ప్రభుత్వం ముద్దు నిద్ర వేడడం లేదని అన్నారు.
ఇప్పటి వరకు 49 మంది విద్యార్థులు చనిపోతే ఉలుకు లేదు పలుకు లేదు. ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు. సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారు. మేము ప్రశ్నిస్తే వార్డెన్లు, ప్రిన్సిపల్స్ మీద చర్యలు తీస్కొని చేతులు దులుపుకుంటున్నారు నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతున్నరు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం లేదు. సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. ఇప్పటికైనా కళ్లు తెరిచారు స్వాగతిస్తున్నాము. గురుకులాల మొక్కుబడి సందర్శన కాదు .. ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి. ఫోటోలకు పోజులు ఇవ్వడం కాదు-పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపండని అన్నారు,
- Advertisement -