విద్యార్థిని చితకబాదిన విక్టరీ కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలి…..
Action should be taken against Victory Coaching Center who crushed the student
ఎస్ఎఫ్ఐ
ఎమ్మిగనూరులోని డిసెంబర్ 14
శనివారం గీతా మందిర్ దగ్గర ఉన్న విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్ లో ధర్మ తేజ అనే విద్యార్థిని క్రమశిక్షణ పేరుతో చితక బాధడం దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి విజయ్ అన్నారు. డబ్బే ద్యేయంగా అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్న నవోదయ కోచింగ్ సెంటర్లపై విద్యాశాఖ అధికారులు పర్యావేక్షణ చేసి చర్యలు తీసుకోకపోవడం వల్లే అరకోర వసతులతో ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘిస్తూ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారని విద్యాశాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని అన్నారు. విద్యార్థులు మాత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు అరకోర వసతులు ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లో నరకయాతన అనుభవిస్తున్నారని వాపోయారు భావితరాలను రేకుల షెడ్డుల్లో అరాకురా వసతులతో శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు…..