ఏడాది పాల‌న‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు..

- Advertisement -

ఏడాది పాల‌న‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు..

Debt incurred by Congress government during one year rule was Rs.1,27,208 crores

మాజీమంత్రి ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు

హైదరాబాద్
ఏడాది పాల‌న‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన అప్పుల‌పై శాస‌న‌స‌భ‌లో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఏడాది కాలంలో రూ. 52 వేల కోట్లు మాత్ర‌మే అప్పు తీసుకున్నామ‌ని ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు.
ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎఫ్ఆర్‌ బీఎం కింద తీసుకున్న అప్పులు రూ. 51 వేల 277 కోట్లు.   రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టు కూడా తీసుకున్నాను. మంగళవారం రోజు కలిపితే ఇంకో రూ. 3 వేల కోట్లు పెరిగింది. అంటే ఎఫ్ఆర్‌బీఎం కింద రూ. 55, 277 కోట్లు తీసుకున్న‌ట్లు రిపోర్టు ఉంది. కార్పొరేష‌న్ గ్యారెంటీల కింద రూ. 61,991 కోట్లు, మ‌రో రూ. 10,099 కోట్లు గ్యారెంటీలు లేకుండా తీసుకున్నారు. మొత్తంగా ఈ ఏడాది పాల‌న‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకున్న అప్పు ఎంతంటే రూ. 1,27,208 కోట్లు. ఇలానే కొనసాగితే 5 ఏళ్లలో అయ్యే అప్పు రూ. 6,36,040 కోట్లు అని హ‌రీశ్‌రావు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular