- Advertisement -
వైసీపీకి దూరంగా కాపులు
Kapulu away from YCP
ఏలూరు, డిసెంబర్ 23, (వాయిస్ టుడే)
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అధికారం దూరమయిన ఆరు నెలల్లోనే షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ప్రధానంగా ఒక సామాజికవర్గం ఆయనకు దూరంగా వెళ్లిపోతుంది. తాజాగా ఈరోజు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరో కీలక నేత గ్రంథి శ్రీనివాస్ కూడా రాజీనామాకు రెడీ అయిపోయారు. అసలు వైసీపీలో ఏం జరుగుుతుంది. ఎక్కడ లోపం ఉంది? ప్రధానంగా కాపు సామాజికవర్గం నేతలు ఫ్యాన్ పార్టీకి దూరమవుతున్నట్లే కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో భవిష్యత్ లేదని భావించిన కాపు సామాజికవర్గం నేతలు తమకు అధికారంలో ఉన్న ప్పుడు మంత్రి పదవులు కట్టబెట్టినా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. వారు రాజీనామా చేయడానికి గల కారణాలు కొత్తవి కాకపోయినప్పటికీ ఒకే సామాజికవర్గం దూరం కావడం జగన్ ఆలోచించాల్సిన విషయమే. ఇప్పటి వరకూ అనేక మంది నేతలు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. వారిలో కాపు సామాజిక వర్గం నేతలే ఎక్కువగా ఉండటం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. తొలుత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య పార్టీకిరాజీనామా చేశారు. తర్వాత అత్యంత నమ్మకమైన నేతగా ఉన్న జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా పార్టీని వదిలి పెట్టి వెళ్లిపోయారు. ఈ ఇద్దరు నేరుగా జనసేనలో చేరారు. తర్వాత ఏలూరు నియోజకవర్గానికిచెందిన మాజీ మంత్రి ఆళ్ల నాని కూడా పార్టీకి ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా అవంతి శ్రీనివాస్ కూడా రాజీనామా చేశారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా రాజీనామా లేఖతో సిద్ధంగా ఉన్నారు. వీరంతా కాపు సామాజికవర్గం నేతలే. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వారే. వీరిలో ఇద్దరికి మంత్రి పదవులు అప్పగించారు జగన్. ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్ లకు మంత్రి పదవులు తొలి విడతనే ఇచ్చారు. నిజానికి మరే పార్టీలో వీరికి మంత్రి పదవి దక్కుతుందన్న ఆశ కూడా లేని పరిస్థితుల్లో జగన్ కేబినెట్ లో చోటు కల్పించారు. కొన్నేళ్ల నుంచిరాజకీయాల్లో ఉన్నా లబించని మంత్రి పదవిని దక్కినా కనీసం ఆ ఆలోచన లేకుండా నేతలు పార్టీని వీడి వెళ్లి పోవడం ఒకరకంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే మంత్రి పదవి ఇప్పుడు వేరే పార్టీలో చేరినా రాదని తెలిసినా రాజీనామాలు చేశారంటే బలమైన కారణాలు ఉంటాయని వేరే చెప్పాల్సిన పనిలేదు.ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తే వైసీపీ నుంచి గెలవడం తమకు కష్టమని వారు భావిస్తున్నారు. తాము ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లోనూ కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్ లేదని భావించారు. మరోసారి ఇక్కడి నుంచి గెలవలేమని కూడా వారు బలంగా నమ్ముతున్నారు. అందుకే తమకు మంత్రి పదవి ఇచ్చినా తమ రాజకీయాలు సుదీర్ఘకాలం కొనసాగాలంటే వైసీపీకి దూరంగా ఉంటేనే మంచిదన్న అభిప్రాయానికి వారు వచ్చినట్లు కనపడుతుంది. జనసేన + టీడీపీ ఓటు బ్యాంకుతో తమకు టిక్కెట్ దొరికితే మంచిభవిష్యత్ ఉంటుందని భావిస్తున్నారు.మరో వైపు వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో కాపు సామాజికవర్గం నేతలు ఎక్కువగా కూటమి పార్టీ వైపు చూస్తున్నారు. అటు టీడీపీ కానీ, ఇటు జనసేనలో కానీ కొత్త నియోజకవర్గాల్లోనైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోదలచుకుంటున్నారు. అందుకేజగన్ కు ఝలక్ఇచ్చిమధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నారుజగన్ వైఖరితో విసుగెత్తిన నేతలు పార్టీని వదిలివెళ్లిపోతున్నారన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఓటమి పాలయినా నేతలతో కలవకుండా ఉండటం, ఏకపక్షనిర్ణయాలను తీసుకోవడం నచ్చక జెండాను పక్కన పడేసి వెళుతున్నారని చెబుతున్నారు. ఏ పార్టీ అధినేత అయినా స్థానికనాయకత్వం అభిప్రాయాలను తెలుసుకోవాలి. అంతే తప్పతన అభిప్రాాయాలను బలవంతంగా రుద్దితే ఇదే పరిస్థితి ఎదురవుతుంది. దీంతో పాటు ఐదేళ్ల కాలంలో జగన్ పర్యటనలు,జగన్ పిలుపు నిచ్చే కార్యక్రమాలకు చేతి చమురు వదిలించుకోవడం మినహా ప్రయోజనం ఉండదని భావించిన నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగున్నా,కనీసం లేనప్పుడైనానేల మీదకు చూస్తే, నేతలకు అందుబాటులోకి వస్తే ఒకింత నేతలకు ఇబ్బంది ఉండదు. కానీ తీరుమారకుంటే వీరే కాదు రానున్నకాలంలో మరింత మంది కూడా వైసీపీకి బై బైచెప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రధానంగా కాపు సామాజికవర్గం నేతలు జగన్ పార్టీకి దూరమవుతారని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి
- Advertisement -