అన్నా క్యాంటీన్ ముందు అదో మాదిరి మత్తైన వాసన
It smelled like that in front of Anna's canteenఏమిటీ అని చెక్ చేయగా
పోలీసులు షాక్
ఎవరి పని అనే కోణం లో దర్యాప్తు
చేపట్టిన పోలీసులు
పల్నాడు
మాచర్ల
పట్టణంలోని ఆర్ అండ్ బి కార్యాయలం ఎదుట అన్నా క్యాంటిన్ ఉంది.
అన్నా క్యాంటిన్ మూడు నెలల క్రితం ప్రారంభించారు. దాన్ని సుందరంగా తీర్చి దిద్దారు
ఇందులో భాగంగా అన్నా క్యాంటిన్ ముందు మొక్కలు పెంచుతున్నారు.
అయితే ఆదివారం కొంతమందికి డౌట్ వచ్చి చూడగా ఆ మొక్కల్లో గంజాయి మొక్క పెరుగుతోంది,
గంజాయి మొక్క చూడటానికి బంతి పువ్వు మొక్కలా ఉంటుంది.
దీంతో అందరూ దాన్ని బంతి మొక్కే అనుకుంటూ వచ్చారు.
అయితే అనుమానం వచ్చి చూడగా అది గంజాయి మొక్కగా తేలింది.
దాని ఆకులు కూడా తుంచినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి.
దీంతో మరింత డౌట్ పెరగడంతో, నిర్వాహకులు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు.
పోలీసులు క్యాంటిన్ వద్దకు వచ్చి పరిశీలించి మొక్కను స్టేషన్ తరలించారు.
అయితే ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా అక్కడ మొక్క నాటారా లేక గతంలో మూతపడి ఉన్న సమయంలో ఎవరైనా గంజాయి సేవించిన వాళ్లు పడేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే అన్నా క్యాంటిన్ వద్ద గంజాయి మొక్క పెరగడం మాచర్ల పట్టణంలో టాక్ ఆప్ ది టౌన్‌గా మారింది.




