అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను

- Advertisement -

అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను

Loud silencers

రోడ్డు రోలర్ తో తొక్కించి డామేజ్

సిద్దిపేట
సైలెన్సర్ మార్ఫింగ్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్.
ఈ సందర్భంగా సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ మాట్లాడుతూ. వాహనం కొనుగోలు చేసేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు ఆర్టీవో నిబంధనల ప్రకారం  సైలెన్సర్ ఉంటుంది  కొంతమంది వ్యక్తులు కావాలని సైలెన్సర్లు మార్పు చేసుకుని  శబ్ద కాలుష్యం పెంచడము మరియు ఇతరులను భయాందోళనలకు గురి చేయడము జరుగుతుంది. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం సైలెన్సర్  మార్పు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గత కొన్ని రోజుల నుండి   స్పెషల్ డ్రైవ్ నిర్వహించి  53 సైలెన్సర్లను  వాహనాల నుండి తీసివేయించి  ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల ప్రకారం ఉండే సైలెన్సర్లను వాహన యజమానుల చేత కొనుగోలు చేయించి ఫిట్ చేయడం జరిగింది. 53 సైలెన్సర్లను ఈరోజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రోడ్డు రోలర్ తో  తొక్కించి డ్యామేజ్ చేయడం జరిగింది. మళ్లీ ఎవరైనా శబ్ద కాలుష్యాన్ని ఇచ్చే సైలెన్సర్ను బిగించినచో  చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి  సంబంధిత వాహన యజమానులను జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు.
ప్రతి వాహన యజమాని ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. మరియు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు. కొంతమంది వ్యక్తులు యువకులు సాయంత్రం సమయంలో కోమటి చెరువు, ఎగ్బాల్ మీనార్, నాసారపుర, రంగనాయక సాగర్ ప్రాజెక్ట్  సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ బైపాస్ రోడ్లలో  బైక్ రైడ్స్ చేస్తున్నారని  వారిపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో పట్టుకుని  చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ సిద్దిపేట ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular