బెదిరింపు కాల్స్ వస్తున్నాయి–లక్ష్మీ పార్వతి

- Advertisement -

బెదిరింపు కాల్స్ వస్తున్నాయి–లక్ష్మీ పార్వతి

Threatening calls are coming--Lakshmi Parvati

హైదరాబాద్..
ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మి పార్వతి హాట్ కామెంట్స్ చేసారు. 29 ఏళ్లుగా ఎన్టీఆర్ దూరమై మనో వేదనకు గురవుతున్నాను. లక్షలాది ప్రజలు చూస్తుండగా నన్ను వివాహం చేసుకున్న విషయం మీకు తెలుసు. నన్ను ఎందుకు ఈ కుటుంబ సభ్యురాలుగా చూడడం లేదు. ఎన్టీఆర్ రాజకీయంగా అధికారంలోకి రావడంలో నా వంతు కృషి చేశాను. ఒక్క రూపాయి ఆశించకుండా చివరి వరకు ఆయనకు సేవలు చేశాను. నిన్న నా ఫోన్ నంబర్ ఎవరో  టీడీపీ వాళ్లు సోషల్ మీడియా లో పెట్టారు. నిన్నటి నుండి వెయ్యికి పైగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మీరు అనుకున్నా అనుకోకున్నా నేను మీ అత్తగారిని కదా చంద్ర బాబు..
ఇలాంటి అవమానం నాకు జరుగుతుంటే ఇలానే చూస్తూ ఉంటారా చంద్రబాబు. ఇన్నేళ్ళు డబ్బు ఉన్నా లేకున్నా ఎవరినీ చేయి చాచి అడగలేదు. ఎన్టీఆర్ గౌరవం కాపాడేలా బ్రతుకుతున్నాను. నామీద ఎందుకు మీకు కక్ష.. అసలు నేనేమీ తప్పు చేశానో కూడా నాకు అర్ధం కావడం లేదు. ఎన్టీఆర్ పేరుతో మీరంతా లక్షలు కోట్లు సంపాదించారు. అలాగే పెద్దయన్ని సాగనంపారు. నాపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు అని ప్రశ్నించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular