- Advertisement -
పదవీ విరమణ వయస్సు తగ్గించాలి
Retirement age should be reducedహైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలకు తగ్గించాలని ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ మోతిలాల్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ వద్ద విద్యార్థులతో నిరసన వ్యక్తం చేశారు.అనంతరం మోతిలాల్ మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచి ఉద్యోగులపై పని భారాన్ని పెంచిందని మండిపడ్డారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయసును తగ్గించి పని భారం లేకుండా చూడాలని కోరారు.ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆర్టీసీ ఉద్యోగులకు పదవి విరమణ వయస్సును 55 సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్ చేశారు. పదవి విరమణ వయసును తగ్గించడం వల్ల ప్రతి యేట 9,000 ఉద్యోగాలను అదనంగా భర్తీ చేయవచ్చని తెలియజేశారు. గత ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగులు నిరుద్యోగులు గానే మిగిలిపోయారని అన్నారు. వయోపరిమితిని పెంచుకుంటూ పోతున్న కొద్ది ఉద్యోగస్తుల ఆరోగ్య సహకరించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోని యెడల రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అందరిని ఏకం చేసి సరూర్ నగర్ స్టేడియంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
- Advertisement -



