- Advertisement -
ఎన్టీఆర్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే మాధవరం
MLA Madhavaram paid tribute to NTRకూకట్ పల్లి
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేడు వసంత నగర్ లో మాజీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ తెలుగు సినిమా రంగంలో అగ్ర నటుడిగా రాణించి ప్రత్యక్ష రాజకీయాలోకి వచ్చి ప్రజలను చైతన్య పరిచిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది నాయకులు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారని ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని సూచించారు.
- Advertisement -




