కాంగ్రెస్ తో కేపీహెచ్బీకి గండం

- Advertisement -

కాంగ్రెస్ తో కేపీహెచ్బీకి గండం

KPHB is at loggerheads with the Congress

హైదరాబాద్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వచ్చిందంటేనే కూకట్ పల్లి నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి గండం వచ్చినట్లు తయారవుతుందని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యానించారు. హౌసింగ్ బోర్డ్ సంబంధించి స్థలాలను బహిరంగ వేలానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కావడంతో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాలనీకి సంబంధించిన మూడు గజాల నుండి 300 గజాలకు పైగా స్థలాలను అమ్మేందుకు ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించారు. హౌసింగ్ బోర్డు స్థలాలకు సంబంధించి ఆరు గజాలు, మూడు గజాలు, 50 గజాలకు సంబంధించిన స్థలాలను ప్రభుత్వం అమ్ముకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు సంబంధించిన స్థలాలను ప్రభుత్వం అమ్మడం హేయమైన చర్య అని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం వదిలేసిన స్థలాలను వేలం వేయడం ద్వారా వచ్చే సొమ్మును ప్రభుత్వం తీసుకోవాలని భావిస్తుందని అన్నారు. ప్రభుత్వ వేలంపాటలో పాల్గొనే వారికి కూడా ముందే తెలియజేస్తున్నామని మీరు వేలంలో దక్కించుకున్న స్థలాలలో నిర్మాణాలను ఎట్టి పరిస్థితిలో చేపట్టకుండా అడ్డుకునేందుకు తమందరం సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular