ఎస్పీ కాలేజీలో క్రీడాపోటీలు

- Advertisement -

ఎస్పీ కాలేజీలో క్రీడాపోటీలు

Sports competitions in SP College

సికింద్రాబాద్
విద్యార్థులలో క్రీడా ప్రతిభను వెలికి తీసి అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎగ్జిబిషన్ సొసైటీ పనిచేస్తుందని ఎగ్జిబిషన్ సొసైటీ క్రీడా కమిటీ సలహాదారు అనిల్ స్వరూప్ తెలిపారు. 84వ అఖిలభారత

ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో పద్మారావు నగర్లోని సర్దార్ పటేల్ కళాశాలలో క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎక్సిబిషన్ సొసైటీ సెక్రటరీ సురేందర్ రెడ్డి

హాజరై ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 18 కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులతో కబడ్డీ, షాట్ పుట్, వాలీబాల్ తోపాటు టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్ క్రీడలను నిర్వహించారు.. ప్రతి ఏటా ఒక కళాశాలను

ఎంచుకుని క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు విద్యార్థులకు ఎస్పీ కాలేజీలో, విద్యార్థినులకు వనిత కళాశాలలో పోటీలు జరుగుతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు కేవలం చదువు ఒకటే కాకుండా క్రీడారంగంలో కూడా

ప్రోత్సాహాన్ని అందించాలని ఉద్దేశంతో ఇలాంటి క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular