సైబర్ నేర నియంత్రణకు మొబైల్ యాప్
Mobile app for cyber crime controlసికింద్రాబాద్
సైబర్ నేరాలను నియంత్రించేందుకు కేంద్ర టెలికాం కమ్యునికేషన్ ఆధ్వర్యంలో నూతనంగా సంచార సారధి మొబైల్ ఆప్ ను ప్రారంభించినట్లు డిజిటి ప్రశాంత్ పాటిల్ తెలిపారు. కేంద్ర టెలికాం కమ్యునికేషన్ శాఖ మంత్రి
జ్యోతిరాధిత్య సింధియా దృశ్యమాధ్యమం ద్వారా డిల్లీలో మొబైల్ యాప్ తో పాటు ఇంట్రా సర్కిల్ రోమింగ్ 4జి, 2.0 ఎన్ బి ఎం లను ప్రారంభించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో సంచార
సారధి మొబైల్ యాప్ ను రూపొందించినట్లు తెలిపారు. సైబర్ మోసాలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ ఈ యాప్ ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. సంచార సారధి మొబైల్
యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం సైబర్ మోసగాళ్ళ ఫోన్ కాల్స్, మెసేజ్ లు ఎక్కడినుండి వచ్చాయనేది గుర్తించేందుకు వీలుంటుందని అన్నారు. వెంటనే టెలికాం సంస్థతో పాటు పోలీసులకు
సమాచారం చేరుతుందని సైబర్ మోసాలు చేసే వారిని పట్టుకునేందుకు ఈ యాప్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. 33 గ్రామాలకు 4g సేవలు అందించడానికి 253 కొత్త సైట్లు మంజూరు చేయబడ్డాయని,
ఇప్పటికే 196 గ్రామాలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.ఎన్ బి ఎం 2.0 కింద గ్రామీణ ప్రాంతాలలో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్లను పెంచడంతోపాటు వాటి వేగవంతమైన సామర్థ్యంతో కూడిన ఇంటర్నెట్ సేవలను
సైతం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఆప్టికల్ ఫైబర్ ద్వారా దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సేవలను అందించడమే లక్ష్యమని అన్నారు.




