ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇవ్వని పార్టీలకు పతనం తప్పదు
The parties that do not give tickets to BCs in the MLC elections are bound to fallకాంగ్రెస్ బిజెపిలు బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి
ఓట్లు బీసీలవి.. సీట్లు అగ్రకులాలకు ఎలా కేటాయిస్తారు ?
రాహుల్ కాంగ్రెస్ అయితే బీసీలకు టికెట్ ఇవ్వండి
రెడ్డి కాంగ్రెస్ అయితే రెడ్డికే ఇవ్వండి
బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బీసీలను బరిలో నిలుపుతాం
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
హైదరాబాద్
రేపు మార్చ్ లో జరగబోయే శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వాల్సిందేనని, టిక్కెట్లు ఇవ్వకపోతే
ఆ రాజకీయ పార్టీలకు పతనం తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు
నేడు హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఇతర బీసీ సంఘాల నేతలతో కలిసి ఆయన మాట్లాడారు ఓట్లు బీసీలవి అయితే సీట్లు అగ్రకులాలకు ఇవ్వడం రాజకీయ
పార్టీలకు అనవాయితీగా మారిందన్నారు, అధికారం లేనప్పుడు అధికారంలోకి రావడానికి గెలుపు గుర్రాల పేరుతో అగ్రకులాలకే టికెట్ లు ఇచ్చిన రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కూడా అగ్రకులాలకి టికెట్లు
ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు
ముఖ్యంగా కరీంనగర్, నిజాంబాద్, మెదక్. అదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా ఇప్పటికే బీజేపీ పార్టీ అగ్రకుల రెడ్డి అభ్యర్థికి సీటు ప్రకటించడం జరిగిందని, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా బిజెపి బాటలోనే రెడ్లకు
టికెట్లు ఇవ్వాలని తహా తహ లాడుతున్నదాతం షోఛనీయమన్నారు
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలైన పిఆర్టియు, యుటిఎఫ్, టిపియస్,దాదాపు అన్ని సంఘాలు అగ్రకుల రెడ్డి అభ్యర్థులను బరిలోకి
దింపుతున్నాయానీ,ఇవి పూర్తిగా బీసీలను విస్మరించి
రెండు మూడు శాతం లేని అగ్రకులాలను బరిలోకి దింపితే వారిని ఈ ఎన్నికలలో కచ్చితంగా ఓడించి తీరుతామని ఆయన హెచ్చరించారు
ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మిత్ర పక్షాలకు మద్దతిస్తామని, కరీంనగర్, నిజాంబాద్, మెదక్ అదిలాబాద్ పట్టభద్రులనియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని
నిలుపుతామని పేర్కొన్నారని, వారి మిత్రపక్షలైన ఉపాధ్యాయ సంఘాల వారు ఇప్పటికే అగ్రకుల రెడ్డి అభ్యర్థులను ప్రకటించారని దీనిని బట్టి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్డి అభ్యర్థులకి మద్దతు
ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుందన్నారు, కనీసం పట్టభద్రుల అభ్యర్థి అయిన బీసీలకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఒకవైపు బీసీ కులగణన జరిగి బీసీలకు జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో వాటా దక్కాలని ఆయన మాట్లాడుతుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇందుకు విరుద్ధంగా
బీసీలకు టికెట్లు ఇవ్వకుండా రెడ్డి అభ్యర్థులకే టికెట్ లు ఇస్తూ రాహుల్ మాటను బుట్ట దాఖలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది రాహుల్ కాంగ్రెస్ న? రెడ్డి కాంగ్రెస్ న తెలవట్లేదని
రాహుల్ కాంగ్రెస్ అయితే బీసీలకు టికెట్ ఇవ్వాలని, రెడ్డి కాంగ్రెస్ అయితే రెడ్లకే టికెట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరిగే శాసనమండలి ఎన్నికలే బీసీలకు టికెట్లు ఇవ్వడం రాజకీయ పార్టీలు ఒక అవకాశం గా తీసుకోవాలని లేకుంటే భవిష్యత్తులో అగ్రకుల రాజకీయ పార్టీలు బీసీల అగ్రహానికి గురై తమ
గోతిని తామే తవ్వుకుంటాయని.. అంతిమంగా అగ్రకుల రాజకీయ పార్టీలకు కాలం చెల్లి బీసీలకు రాజకీయ శకం ఆరంభమవుతుందని 2029లో బీసీల రాజకీయ అధికారానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే
పునాదికానున్నాయని ఆయన హెచ్చరించారు . బీసీ కులగన చేసి కూడా బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో బీసీలు ఇక ఎప్పటికీ నమ్మరని ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టి కూడా
తీసుకుపోతామని ఆయన తెలిపారు. రెండు మూడు రోజుల్లోనే ఎమ్మెల్సీ ఎన్నికలు బీసీల పాత్ర, భవిష్యత్ కార్యాచరణ పై హైదరాబాదులో బీసీ మేధావులు, బిసి సంఘాలు, కుల సంఘాలతో విస్తృత స్థాయి సమావేశాన్ని
ఏర్పాటు చేసి బీసీలకు అగ్రకుల రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వని పక్షంలో స్వతంత్రంగా బీసీ అభ్యర్థులను ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలబెట్టడానికి ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జాజుల శ్రీనివాస్
గౌడ్ తెలిపారు.
ఈ సమావేశం లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, రాష్ట్ర కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర
అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూదాని సదానందం, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కడారి వెంకటేష్ గౌడ్, బీసీ మహిళా సంక్షేమ సంఘం గ్రేటర్
హైదరాబాద్ అధ్యక్షురాలు సిద్ధాంతం శ్యామల, బీసీ నాయకులు గుంటి మహేష్, ఇంద్రం రజక తదితరులు పాల్గొన్నారు



