ఆలయ భూముల్లో సోలార్ పవర్ ఉత్పత్తి

- Advertisement -

ఆలయ భూముల్లో సోలార్ పవర్ ఉత్పత్తి

Solar power generation in temple lands

హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయ భూముల్లో సోలార్ పవర్ ను ఉత్పత్తి చేయనున్నారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. తొలుత 22 దేవాలయాల పరిధిలోని 719.12 ఎకరాల్లో వీటిని నెలకొల్పేందుకు ప్లాన్ రెడీ అయింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ ప్లాంట్లను నెలకొల్పి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. అందుకు అధికారులు గుర్తించిన 719.12 ఎకరాల ఆలయాల భూముల్లో అత్యధికంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే 356.34 ఎకరాల స్థలాలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 109.06 ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 96.36 ఎకరాలు గుర్తించారు. మిగిలిన స్థలాలు ఇతర జిల్లాల్లో ఉన్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular