- Advertisement -
స్టీల్ ప్లాంట్ నిధులపై పలు సందేహాలు
Doubts on Steel Plant Funding
బోత్స
విశాఖపట్నం
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పలు సందేహాలు వ్యక్తం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విశాఖలో పర్యటించారని.. ఆ సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణపై ఆయన ఎందుకు మాట్లాడ లేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు. అందుకు సంబంధించి తమ కు ఎన్నో అనుమానాలున్నాయ న్నారు. ప్యాకేజీ ఇచ్చారని కూటమి నేతలు అంటున్నారని.. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని ఎం దుకు చెప్పడం లేదంటూ ప్రభుత్వా న్ని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నిం చారు.అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణ చేసే ఉద్దేశ్యంతోనే ఈ ప్యాకేజీ ఇచ్చారని తమ అభిప్రాయని ఆయ న వ్యాఖ్యానించారు. ఎందుకు ఈ ముసుగులో మాటలు అంటూ కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కర్ణాటక స్టీల్ ప్లాంట్‌కు 15 వేల కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు.
- Advertisement -