మునిపల్లిలో మంత్రి దామోదర పర్యటన

- Advertisement -

మునిపల్లిలో మంత్రి దామోదర పర్యటన

Minister Damodara's visit to Munipalli

మెదక్
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి, రాయికోడు మండలాలలో పర్యటించారు.
మునిపల్లి మండలం బుదేరా గ్రామంలోనీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ అండ్ పిజి కాలేజ్ ఫర్ ఉమెన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల లను పరిశీలించారు.  కళాశాలలో జరుగుతున్న అదనపు తరగతుల భవన నిర్మాణాలను, డ్రైనేజీ వ్యవస్థను, క్రీడా మైదాన నిర్మాణ పనులను, కళాశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను, అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు.
అనంతరం, తాటిపల్లి గ్రామంలోనీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ను పరిశీలించారు.
కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులతో పాఠశాల అభివృద్ధిపై చర్చించారు. పాఠశాల అభివృద్ధి కి అవసరమైన మౌలిక సదుపాయాలను సిఎస్ఆర్ నిధులతో చేపడతామన్నారు. కేజీబీవీ పాఠశాలలో వంటగదిని పరిశీలించారు.పాఠశాల విద్యార్థులకు విశాలమైన డైనింగ్ హాల్ నిర్మాణం, డిజిటల్ క్లాస్ రూమ్ లో ఏర్పాటు, ఆర్ ఓ ప్లాంట్ , అదనపు తరగతి గదుల నిర్మాణం, పేరెంట్స్ వెయిటింగ్ హాల్ నిర్మాణ పనులను సిఎస్ఆర్ ఫండ్స్ తో చేపడుతామన్నారు దామోదర్ రాజనర్సింహ.రాయికోడు మండలంలోని నూతనంగా ఏర్పాటుచేసిన అక్షయ హాస్పిటల్ ను మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular