Tuesday, January 21, 2025

ఈ సంవత్సరం మార్చి నుంచి నైని బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తాం

- Advertisement -

ఈ సంవత్సరం మార్చి నుంచి నైని బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తాం

We will produce coal from Naini Block from March this year

గత సంవత్సరం జూలై 24న జరిగిన చర్చలు ఫలించాయి

విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు నైని బొగ్గు బ్లాక్ దగ్గరే 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మిస్తాం.
వసరమైన స్థలాన్ని కేటాయించండి

ఒరిస్సా సీఎం మోహన్ చరణ్ మాంజితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

నైని బొగ్గు గనుల ద్వారా ఈ సంవత్సరం మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తామని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఒరిస్సా రాష్ట్రంలోని కోణార్క్ లో జరుగుతున్న మూడవ జాతీయ మైనింగ్ మంత్రుల సదస్సు సందర్భంగా ఒరిస్సా రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాంజీ తో డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సందర్భంగా ఓ లేఖను ఆయనకు అందజేశారు. ఒరిస్సా రాష్ట్రంలోని అంగూల్ జిల్లాలో నైని బొగ్గు గనిని స్థాపించేందుకు ఒడిస్సా సీఎం కార్యాలయం నుంచి అద్భుతమైన మద్దతు అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రగాఢ కృతజ్ఞత తెలియజేస్తున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేఖలో పేర్కొన్నారు. గత సంవత్సరం జూలై 24న మీతో జరిగిన సమావేశాన్ని ఎప్పటికీ మర్చిపోలేను, ఆ చర్చలు ఫలవంతం అయ్యాయని తెలిపారు. నైని క్యాప్టివ్ బ్లాక్ అయినందున బొగ్గు గని నుంచి ఉత్పత్తి చేసిన బొగ్గును తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా జైపూర్ లోని 800 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు సరఫరా చేయాలి. జైపూర్ విద్యుత్ ప్లాంట్ నైనీ గని నుంచి దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది, లాజిస్టిక్స్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి ఒడిశాలోని నైనా బొగ్గు గని సమీపంలో పిట్ హెడ్ ఓవర్ ప్లాంట్ గా 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని భావిస్తోంది, దీని ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గడంతో పాటు, ఉత్పత్తి అయిన బొగ్గు లాభదాయకంగా ఉపయోగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నామని ఒరిస్సా సీఎంకు అందించిన లేఖలో తెలిపారు.
20వ EPS (ఎలక్ట్రికల్ పవర్ సర్వే) నివేదిక ప్రకారం రాబోయే మూడు దశాబ్దాల పాటు థర్మల్ విద్యుత్కు భారీ డిమాండ్ ఉంటుంది. 1.5.2024 న Moc కార్యదర్శి రాసిన లేక ద్వారా గనులకు దగ్గరగా కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్లను స్థాపించాల్సిన అవసరం ఉంది. రవాణా ఖర్చును తగ్గించడం, నాణ్యమైన విద్యుత్ సరఫరా, పర్యావరణాన్ని పరిరక్షించడం వంటి అంశాల నేపథ్యంలో గని నుంచి విద్యుత్తు ఉత్పత్తి లాభదాయకంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. సింగరేణి అధికారుల బృందం, ఒడిస్సా అధికారుల బృందంతో జరిగిన చర్చల్లో భాగంగా జరపాడ/తుకుడ& హండప్ప/బని నాలిని సైట్లు రెండు రాష్ట్రాలకు చాలా ప్రయోజనకరమైనవి, ఇవి ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు సానుకూల మౌలిక సదుపాయాల అభివృద్ధిని అందిస్తాయని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని నైని బొగ్గు గని సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును స్థాపించడానికి తగిన భూమిని కేటాయించేందుకు, ఏర్పాట్లచేసేందుకుకు సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతున్నట్టు డిప్యూటీ సీఎం తన లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్