అనకాపల్లి అభివృద్దిపై ప్రత్యేక దృష్టి–మంత్రి కొల్లు రవీంద్ర

- Advertisement -

అనకాపల్లి అభివృద్దిపై ప్రత్యేక దృష్టి–మంత్రి కొల్లు రవీంద్ర

Special focus on Anakapalli development--Minister Kollu Ravindra

అనకాపల్లి
కలిసి పనిచేసి జిల్లానుపారిశ్రామిక, వ్యవసా య రంగాల్లో పరుగులు పెట్టిద్దామని,జిల్లానుఅన్ని రంగా ల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొ న్నారు.అనకాపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రణాళికల అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో కలెక్టరేట్లోని సమావేశ మందిరం లో సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ అనకా పల్లి జిల్లాను ఐదేళ్లలో రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచేలా సమష్టి గా కృషి చేయాలన్నారు. తలసరి ఆదాయంలో విశాఖపట్నం జిల్లా మొదటి స్థానంలో వుండగా, పక్కనే వున్న అనకాపల్లి జిల్లా 12వ స్ధానం లో ఉందని అన్నారు. జిల్లాలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొ ని 2029 నాటికి విశాఖపట్నంతో సమానంగా అనకాపల్లిని అభివృద్ధి లో నిలిపేందుకు అధికారులు కలసి కట్టుగా పనిచేయాలని అన్నారు. ఇప్పటికే మంజూరైన అభివృద్ధి పనులను నిర్దే శిత గడువులోగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకు రావాలన్నారు. జిల్లాలో రోడ్ల మర మ్మతులను ఈ నెలా ఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మం జూరైన నిధులు మార్చి నెలాఖరు లోగా ఖర్చు చేయాలని, అందువల్ల అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular