- Advertisement -
ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
Heavy fire in Eluru district
ఏలూరు
ఏలూరు జిల్లా మండవల్లి మండలం బైరవపట్నం లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో పక్షులను వేటాడే వేటగాళ్లకు చెందిన 20 ఇళ్లు దగ్ధం అయ్యాయి. పక్షులను బెదిరించే నాటు తుపాకీ లో వాడే మందు గుండు సామాగ్రికి దోమల అగరబత్తీ అంటుకుంది. దాంతో నిప్పురవ్వలు చెలరేగాయి. నివాసాల్లోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. అగ్నికీలల ధాటికి ఇల్లు పూర్తిగా కాలి బూడిదైయాయి. ప్రమాదంలో ఆరుగురుకి తీవ్రగాయాలు అయక్యాయి. వారిలో ముగ్గురు చిన్నారులు, ఒక మహిళ వున్నారు. బాధితులను కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -



