- Advertisement -
గణతంత్ర దినోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
SP inspected the Republic Day arrangements
ఏలూరు
ఏలూరు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఆదివారం నిర్వహించే 76 గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ పరిశీలించారు. పోలీస్ సిబ్బంది హోమ్ గార్డ్స్ ఎన్. సి. సి క్యాడెట్లు రిహార్సల్స్ నిర్వహించారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు విచ్చేసే వివిఐపి, వీఐపీ అతిథులకు కూచోవాడానికి సిట్టింగ్ ఏర్పాట్లు ఎలా చేశారు అనే విషయాలను గురించి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
రిపబ్లిక్ డే ఉత్సవాలకు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కూర్చోవడానికి తగిన స్థలాన్ని ఏర్పాటు చేయాలి. మంచినీటి సౌకర్యం కల్పించాలి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిపబ్లిక్ డే ఉత్సవాన్ని రాష్ట్రంలోనే గుర్తించే విధముగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏ .ఆర్ అదనపు ఎస్పి ఎన్ఎస్ఎస్ శేఖర్, ఏ .ఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, ఆర్. ఐ పవన్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
- Advertisement -



